Advertisement

సినిమాలకు విద్యాబాలన్ గుడ్‌బై..!

Sat 04th Apr 2015 05:18 AM
vidya balan,bullithera,vendithera,serials,vidya balan actress,bollywood  సినిమాలకు విద్యాబాలన్ గుడ్‌బై..!
సినిమాలకు విద్యాబాలన్ గుడ్‌బై..!
Advertisement

పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ సడన్‌గా సినిమాలకు గుడ్‌బై ఎందుకు చెప్పిందని అనుకుంటున్నారా? అయితే తొందరపడకండి.. ఈ అందాలభామ సినిమాలకు ఓ ఏడాది పాటు మాత్రమే దూరం కాబోతుంది. బుల్లితెరపై సందడి చేయడానికి వెండితెరకు కాస్త గ్యాప్ ఇవ్వబోతుంది. వివరాల్లోకి వెళితే.. త్వరలో బుల్లితెరపై టాక్‌షోతో సందడి చేసేందుకు విద్య సిద్ధమవుతోంది. ఓఫ్రా విన్‌ఫ్రే షో తరహాలో సాగే ఈ కార్యక్రమాన్ని హాలీవుడ్ స్టూడియో, అమెరికా టెలివిజన్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ విషయాన్ని గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ ‘సీరియల్స్ ద్వారానే నా కెరీర్ ఆరంభమైంది.  సినిమాలతో బీజీగా మారటంతో ఈ మధ్యకాలంలో టీవీకి కొంత దూరమయ్యాను. హీరోయిన్‌గా చెలామణి అవుతున్నందున టెలివిజన్ కార్యక్రమాల్లో నటించకూడదనే నిబంధనలేవి నేను విధించుకోలేదు.  చాలా రోజులుగా మంచి కార్యక్రమంతో టీవీ ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాను. అలాంటి తరుణంలో సామాజిక స్పృహతో కూడిన ఈ టాక్‌షో కాన్సెస్ట్ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి నా వంతుగా సహాయంచేసే అవకాశం దొరుకుతుందనే ఉద్ధేశ్యంతోనే ఈ షో చేయడానికి అంగీకారం తెలిపాను. ఆరు నెలల పాటు నా డేట్స్ మొత్తం  దీనికే  కేటాయించాల్సి వస్తుండటంతో ఈ ఏడాది సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement