Advertisement

సినీజోష్‌ ఇంటర్వ్యూ: సయామి ఖేర్‌

Sat 14th Mar 2015 09:03 AM
telugu movie rey,heroine sayami kher,saidharam tej,yvs chowdary,rey movie on 27th march  సినీజోష్‌ ఇంటర్వ్యూ: సయామి ఖేర్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: సయామి ఖేర్‌
Advertisement

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రేయ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతోంది సయామి ఖేర్‌. సినిమా, మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సయామి ఖేర్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘రేయ్‌’ మూవీలో యాక్ట్‌ చెయ్యడం మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?

ఈ సినిమా మాకు మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్కూల్‌లాంటిది. వేరే సినిమా ఏది చేసినా ఇన్ని విషయాలు మాకు తెలిసేవి కావు. వై.వి.ఎస్‌.చౌదరిగారు మాకు అలా అన్నీ నేర్పించారు. యాక్టింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్‌ ప్రతి విషయంలో చౌదరిగారు ఎంతో కేర్‌ తీసుకున్నారు. వీటన్నింటినీ మించి ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌గా మారిపోయాము. షూటింగ్‌ డేస్‌ చాలా ఫన్నీగా గడిచిపోయాయి. మేమంతా చాలా క్లోజ్‌ అయ్యాము, మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాము. 

ఈ సినిమా చేస్తున్నప్పుడు లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ ఏమీ రాలేదా?

స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కొన్ని రోజులకు లాంగ్వేజ్‌ కాస్త అర్థమైంది. స్లోగా మాట్లాడితే పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. చిన్న చిన్న వర్డ్స్‌ మాట్లాడడం తెలిసింది. అయితే సంవత్సరం గ్యాప్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను కాబట్టి తెలుగు మర్చిపోయాను. మీరు మాట్లాడేది మాత్రం అర్థం అవుతుంది. 

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

నేను 2012లో కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌కి మోడల్‌గా చేశాను. ఆ ఫోటోలు చూసి చౌదరిగారు నాతో ఆడిషన్‌ చేశారు. ఈ సినిమాలో క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతానని నన్ను ఓకే చేశారు. నేను మోడల్‌గానే కాకుండా కొన్ని వర్క్‌ షాప్స్‌లో కూడా చేశాను. సినిమా, మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వున్న ఫ్యామిలీ కావడంవల్ల నన్ను ఈ సినిమాకి సెలెక్ట్‌ చేసుకున్నారు.

‘రేయ్‌’ మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

ఈ సినిమాలో అమెరికా వెళ్ళే క్యారెక్టర్‌ నాది మాత్రమే. ఇండియాలో సింపుల్‌ గర్ల్‌గా వున్న నేను అమెరికా వెళతాను. అక్కడ ఒక బ్యాండ్‌లో మెంబర్‌ని ఎలా అయ్యాను అనేది నా క్యారెక్టర్‌. ఈ సినిమాలో నన్ను చాలా గ్లామరస్‌గా చూపించారు వైవియస్‌గారు. అలాగే పాటల్ని కూడా ఎంతో అందంగా తీశారు. ఈ సినిమాలో అన్ని పాటలు చాలా ఎక్స్‌లెంట్‌గా వుంటాయి. దాదాపు అన్ని పాటలూ అమెరికాలోనే షూట్‌ చెయ్యడం జరిగింది. 

సాయిధరమ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

షూటింగ్‌ డేస్‌ ఎంతో ఫన్నీగా గడిచిపోయాయి. సాయి చాలా మంచి పర్సన్‌. ఈ సినిమా కంప్లీట్‌ అయ్యేసరికి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయ్యాము. షూటింగ్‌ గ్యాప్‌లో మేమిద్దరం సెట్‌లో క్రికెట్‌ ఆడేవాళ్ళం. ఈ సినిమా సైన్‌ చేసే టైమ్‌కి అతను చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చాడని తెలీదు. తెలిసిన తర్వాత చాలా భయపడ్డాను. చిరంజీవిగారంటే చాలా పెద్ద పేరు వుంది. సాయి యాటిట్యూడ్‌ ఎలా వుంటుందోనని టెన్షన్‌ ఫీల్‌ అయ్యాను. కానీ, సాయి చాలా స్వీట్‌ పర్సన్‌, డౌన్‌ టు ఎర్త్‌ వుండే వ్యక్తి.

పవన్‌కళ్యాణ్‌ని కలిశారా?

ఆయన్ని ఆడియో ఫంక్షన్‌కి వచ్చినపుడు కలిశాను. పవన్‌ సర్‌ గురించి సాయి ఎప్పుడూ చెప్తూ వుండేవారు. ఆడియో ఫంక్షన్‌లో వాళ్ళిద్దరినీ పక్కపక్కనే చూసినపుడు ఇద్దరికీ చాలా పోలికలు వున్నాయని అర్థమైంది. పవన్‌ సర్‌ యాక్ట్‌ చేసిన గబ్బర్‌సింగ్‌ చూశాను. ఆడియో ఫంక్షన్‌ జరుగుతున్నప్పుడు ఆయన ఆడిటోరియంకి రాగానే ఆడియన్స్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ చూసి నేను చాలా షాక్‌ అయ్యాను. జనం ఈలలు, కేకలు చూసిన తర్వాత ఆయనకి ఎంత పెద్ద ఫాలోయింగ్‌ వుందో నాకు అర్థమైంది. ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక స్టార్‌ అయి వుండి కూడా సింపుల్‌గా, డౌన్‌ టు ఎర్త్‌ వుంటారని తెలుసుకున్నాను. అలాగే బన్ని, చరణ్‌ని కూడా కలిశాను. వాళ్ళు కూడా ఎంతో స్వీట్‌ పర్సన్స్‌. నా బ్యాడ్‌ లక్‌ ఏమిటంటే చిరంజీవిగారిని కలుసుకోలేకపోయాను. 

తెలుగులో మీ ఫేవరేట్‌ హీరో ఎవరు?

తెలుగులో మహేష్‌, బన్ని, చరణ్‌ సినిమాలు చూశాను. నాకు బాగా నచ్చాయి. యాక్టింగ్‌లో ఎవరి స్టైల్‌ వారికి వుంది. కాబట్టి ఎవరు నా ఫేవరేట్‌ అనేది చెప్పడం కష్టం. అయితే వారితో కలిసి నటించాలని మాత్రం నాకు వుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘రేయ్‌’ హీరోయిన్‌ సయామి ఖేర్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement