Advertisement

స్పందించిన సమంత, సిద్ధార్థ్..!

Tue 03rd Feb 2015 06:56 AM
samantha,siddharth,banglore days movie,twitter  స్పందించిన సమంత, సిద్ధార్థ్..!
స్పందించిన సమంత, సిద్ధార్థ్..!
Advertisement

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బెంగుళూరుడేస్' చిత్రాన్ని త్వరలో తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంతలు కలిసి నటిస్తున్నారనే వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత, సిద్ధార్థ్ లు విడివిడిగా ఒకేరోజు తమ ట్విట్టర్ లో ఖండించారు. తాము కలిసి నటించడం లేదని వారు తెలిపారు. సమంత విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అల్లుఅర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'సన్నాఫ్ కృష్ణమూర్తి' చిత్రంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న రామ్ చరణ్-శ్రీనువైట్ల చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ తో సమంత కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడంతో ఆసక్తి నెలకొనివుంది. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement