Advertisementt

లోకేష్‌ కృషికి ద‌క్కిన ఫ‌లితం

Wed 15th Apr 2026 01:47 PM
nara lokesh  లోకేష్‌ కృషికి ద‌క్కిన  ఫ‌లితం
Minister Nara Lokesh లోకేష్‌ కృషికి ద‌క్కిన ఫ‌లితం
Advertisement
Ads by CJ

ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ కృషికి దక్కిన ఫలితమే నేడు ఇంటర్ ఫలితాలు. ప్రభుత్వ కళాశాల్లో పెరిగిన ఉత్తీర్ణతాశాతమే దీనికి నిదర్శనం. విద్యాశాఖ ఎవ‌రు తీసుకున్నా అది పెద్ద స‌వాల్ స్వీక‌రించిన‌ట్టే. అదే విధంగా యువ రాజకీయనాయకుడిగా మంగళగిరి ఎమ్యెల్యే గా అద్భుతమైన మెజారిటీతో గెలిచి కష్టమైన విద్యాశాఖను చేప‌ట్టి నారా లోకేష్ పెను స‌వాల్ స్వీక‌రించారు. విద్యావ్య‌వ‌స్థ‌లో పేరుకుపోయిన, కూరుకుపోయిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. సరికొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికారు. అస్తవ్యస్తంగా పడిఉన్న విద్యావ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టారు. ఇప్పుడు అంత క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఇంట‌ర్ ఫ‌లితాల రూపంలో నెరవేరింది. నారా లోకేష్ ని మంత్రిగా కాదు విద్యాశాఖ హీరో ని చేసింది.

ఈ ఏడాది ఇంటర్మీడియట్  ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వ‌చ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు, అమ‌లుచేసిన ప్ర‌ణాళిక‌ల వ‌ల్లే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని విద్యావేత్త‌లు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు 

మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత..ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.

రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత..ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.

 ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో .. 

మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి.

రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫ‌లితాలు న‌మోద‌య్యాయి. 

ఎన్నడూ లేని విధంగా డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న భోజ‌న పథకాన్ని ఇంట‌ర్ విద్యార్థుల‌కూ అమ‌లు అయ్యేలాచేశారు. స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్,  సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు/మాన్యువల్స్‌ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి, బోధనకు అంతరాయం లేకుండా చూశారు.

ఐటి శాఖ నే కాదు విద్యాశాఖా మంత్రిగా సమర్ధవంతంగా పని చేసిన నారా లోకేష్ ప‌ట్టుద‌ల‌, కృషితో ఇంట‌ర్ మీడియ‌ట్‌లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయి 

Minister Nara Lokesh:

Nara Lokesh

Tags:   NARA LOKESH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ