Advertisementt

173 నుంచి సీబి చ‌క్ర‌వ‌ర్తి ఔట్..మ‌ళ్లీ అత‌డే

Tue 14th Apr 2026 02:59 PM
thalaivar 173  173 నుంచి సీబి చ‌క్ర‌వ‌ర్తి ఔట్..మ‌ళ్లీ అత‌డే
CB chakravarthy out of Thalaivar 173 173 నుంచి సీబి చ‌క్ర‌వ‌ర్తి ఔట్..మ‌ళ్లీ అత‌డే
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి సంబంధించి  ఓ ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. తొలుత ఈ ప్రాజెక్టును డాన్ చిత్ర దర్శకుడు సీబీ చక్రవర్తి పట్టాలెక్కిస్తారని వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ఇమేజ్‌కు తగినట్లుగా సీబీ ఒక కథను సిద్ధం చేసి వినిపించినప్పటికీ స్క్రిప్ట్ చర్చల దశలో సూపర్ స్టార్‌కు పూర్తిస్థాయిలో సంతృప్తి కలగలేదని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీబీ చక్రవర్తి  ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు.

సీబీ ఎగ్జిట్ అయిన వెంటనే ఆ స్థానంలోకి `ఓ మై కడవులే` చిత్రంతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు పేరు తెరపైకి వచ్చింది. అశ్వత్ ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఒక వైవిధ్యమైన లైన్ వినిపించారని, ఆ కథలోని కొత్తదనం సూపర్ స్టార్‌ను విపరీతంగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటూనే రజనీ మార్క్ స్టైల్‌ను మిస్ కాకుండా అశ్వత్  కథను సిద్ధం చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించబోతోంది. వరుస విజయాలతో ఊపుమీ దున్న రజనీకాంత్ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ తన లైనప్‌ను ఎనర్జిటిక్‌గా మార్చుకుంటున్నారు. గతంలో సిబి చక్రవర్తి పేరు ఖరారైనట్లే కనిపించినా?  ఇప్పుడు అశ్వత్ మరిముత్తు రేసులోకి రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

CB chakravarthy out of Thalaivar 173:

Ashwanth for Thalaivar 173

Tags:   THALAIVAR 173
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ