ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shikhar Dhawan Marries Long Time Girlfriend Sophie Shine

ప్రియురాలితో శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి

Shikhar Dhawan Marries Long Time Girlfriend Sophie Shine

టీమ్ ఇండియా మాజీ ఓపెన‌ర్ శిఖర్ ధావన్ రెండో వివాహం ఐరిష్‌ యువ‌తి సోఫీ షైన్ తో వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌ల్లో బంధుమిత్రులు స‌హా సినీరాజ‌కీయ క్రీడా రంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. శ‌నివారం జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో ధావ‌న్ స్నేహితుడు దురంధ‌ర్ ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ సంద‌డి హాట్ టాపిగ్గా మారింది.

సంగీత్, మెహందీ స‌హా పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ధావ‌న్ భార్య సోఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందంటూ నెటిజ‌నులు కితాబిచ్చేస్తున్నారు. అంద‌మైన అమ్మాయిని పెళ్లాడిన అదృష్ట‌వంతుడు అంటూ ధావ‌న్ బోయ్ ని ప్ర‌శంసిస్తున్నారు. వ‌ధువు వేష‌ధార‌ణ‌లో సోఫీ ఎంతో ముచ్చ‌ట‌గొలుపుతోంది. క్రికెట‌ర్లు రోహిత్ శర్మ స‌హా ప‌లువురు కో ఆట‌గాళ్లు ఈ పెళ్లిలో సంద‌డి చేసారు. శిఖర్ ధావన్ తన మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ సోఫీతో కొత్త జీవితం ప్రారంభ‌మైంది. కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఐరోపాకు చెందిన సోఫీ దుబాయ్ స‌హా ప‌లు ఖ‌రీదైన న‌గ‌రాల‌లో కార్పొరెట్ ఉద్యోగాలు చేసారు. మోడ‌ల్ గాను సుప‌రిచితురాలు.

Shikhar Dhawan marries Sophie Shine

shikhar dhawan