Advertisement

ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్

Fri 30th Jun 2023 07:10 PM
captain miller first look  ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్
Captain Miller First Look ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్
Advertisement

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ కెప్టెన్ మిల్లర్. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ ని చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించారు ధనుష్. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ధనుష్ లుక్ టెర్రిఫిక్ గా వుంది.

ఈ చిత్రంలో కన్నడ స్టార్  శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌  తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి,శ్రేయాస్ కృష్ణ డీవోపీ గా పని చేస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.

కెప్టెన్ మిల్లర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Captain Miller First Look:

Dhanush Captain Miller First Look Unleashed

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement