Advertisement

నాకు నేనుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నా: మంచు లక్ష్మి!

Sat 09th Jun 2018 08:26 PM
wife of ram,trailer release,manchu lakshmi,rakul,mohan babu,wife of ram trailer release  నాకు నేనుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నా: మంచు లక్ష్మి!
Wife of Ram Trailer Released నాకు నేనుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నా: మంచు లక్ష్మి!
Advertisement

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంచు మోహన్ బాబుతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు వంశీ కృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాక్షించారు.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ ను మోహన్ బాబు ఆవిష్కరించారు.. 

ముఖ్య అతిథిగా హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను. నాకు థ్రిల్లర్ జానరంటే ఇష్టం. విజయ్ కి ఇది తొలి సినిమాలా లేదు. నేను సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశాను.. అవన్నీ చాలా చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చాయి.. ఎంటైర్ టీమ్ తో పాటు నా డియరెస్ట్ ఫ్రెండ్ లక్ష్మికి ఆల్ ది బెస్ట్.. అని అన్నారు. 

కమెడియన్ ప్రియదర్శి మాట్లాడుతూ.. నన్ను అందరూ కమెడియన్ గా చూస్తున్న టైమ్ లో నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి.. నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్ కి చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఇక సెట్స్ లో ఆడా, మగా అనే భేదాల్లేకుండా అందర్నీ సమానంగా చూడటం నచ్చింది. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని చెప్పారు. 

దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మన తెలుగు సినిమా మారుతోంది. కథ, కథనాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తగా ఆలోచిస్తున్నారు. అలాంటి బెస్ట్ మూవీస్ సరసన ఈ మూవీ నిలుస్తుందనుకుంటున్నాను. ఇక మోహన్ బాబుగారు నాకు చాలా నేర్పారు. ఆయనతో ఒక నిమిషం మాట్లాడితే సినిమాలే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటాం.. అంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు..   

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నాటకాలు వేస్తూ దర్శకత్వం వహిస్తూ వచ్చాను. పదేళ్లుగా నాకు లక్ష్మిగారు తెలుసు. ఓ స్టేజ్ ఆర్టిస్ట్ గా డిప్రెషన్స్ , అప్రెషన్స్ వంటి స్టేజెస్ అన్నీ దాటేశాను. ఏ ఆర్టిస్ట్ కైనా అవకాశం రావడం ముఖ్యం. అలాంటి చాన్స్ నాకు లక్ష్మిగారు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.. అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. మంచు ఎంటర్టైన్మెంట్స్ తో భాగస్వామ్యం వల్ల.. షూటింగ్ కు కూడా వెళ్లే అవసరం లేకపోయింది. అంతా కష్టపడ్డారు. అవుట్ బావుంది. హిట్ అవుతుందనే నమ్ముతున్నాను.. అని అన్నారు.  

హీరో సమ్రాట్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మి గారికి థ్యాంక్స్, విజయ్ విజన్ అద్భుతంగా ఉంది. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించారు. ఆల్రెడీ విదేశీ ఫిలిమ్ ఫెస్టివల్స్ లోనూ ప్రూవ్ చేసుకుంది. సో.. మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను.. అన్నారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. సినిమా గురించి ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పాను. కానీ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. రిలీజ్ తర్వాత మీరే మాట్లాడతారు. లక్ష్మిగారిని గతంలో ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశాను. అయినా నన్ను నమ్మి ఓ ఫ్రెండ్ లా అన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా నా డైరెక్షన్ టీమ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.. అన్నారు. 

ఆత్మీయ అతిథి శిల్పారెడ్డి మాట్లాడుతూ.. సమ్రాట్ నాకు బ్రదర్. సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయినా మోహన్ బాబుగారి ప్యామిలీ చాలా కాలంగా తెలుసు. కానీ లక్ష్మి కొంతకాలంగానే తెలుసు. తను అనుకున్నది చేస్తూ.. సాధిస్తూ వెళుతోన్న మంచు లక్ష్మి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీ హార్డ్ వర్క్ గురించి వింటుంటే రిజల్ట్ మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా వచ్చుంటుందనేదే అనుకుంటున్నా.. అన్నారు.

'మహానటి' నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ... మేం ఎప్పుడయినా బాగా పనిచేసాం అనుకున్నప్పుడు లక్ష్మి చేస్తున్న  షోస్, వెబ్ సిరీస్, సినిమాలు గుర్తుకు వస్తే మేం చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. మోహన్ బాబు అంకుల్ కి ఈ  వేదిక మీద మరోసారి థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ వెరీ హార్డ్ వర్కర్. ఒకేసారి ఎన్నో పనులు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నావు. తన అన్ని విజయాల కంటే ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

వైఫ్ ఆఫ్ రామ్ ప్రధాన పాత్రధారి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మా నాన్నే నాకు పెద్ద గిఫ్ట్. ఏ దశలోనూ ఆర్టిస్ట్ కావాలని కోరుకోని నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నే. నేను ఎక్కడున్నా.. నీ కూతురుగా ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం మేం. లోకంలో ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే ప్రపంచం అంత ఎక్కువ అందంగా ఉంటుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తెలుస్తాడు. ప్రొడ్యూసర్ గారు నన్ను పూర్తిగా నమ్మడంతో నాకు ఇంకా బాధ్యత పెరిగింది. మా వర్క్ ను అంతబాగా నమ్మినందుకు విశ్వగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. మై రాక్ స్టార్ డైరెక్టర్ విజయ్.. అతను లేకపోతే ఈ సినిమాయే లేదు. రెండుమూడు కథలు అనుకున్నాం. ఫైనల్ గా ఈ కథను ఓకే చేశాం. ఏనాడూ బడ్జెట్ గురించి ఒక్క రూపాయి పెంచమని అడగలేదు. తనే ఓ నిర్మాతగా ఆలోచించి మరీ తెరకెక్కించారు. నువ్వు ఖచ్చితంగా నిర్మాతల దర్శకుడుగా పేరు తెచ్చుకుంటావ్.. చాలా బిజీగా ఉన్నా మేం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్.  స్వప్న వంటి అమ్మాయిలందరం కలిసి సినిమాలు చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నా ఫ్యామిలీయే నా బ్యాక్ బోన్.. మోహన్ బాబు కూతురుగా కాకుండా నా సొంత ప్రతిభతోనే ఎదిగే ప్రయత్నం చేస్తున్నా. ఇక సినిమా ప్రతిక్షణం థ్రిల్ చేస్తుందనే గ్యారెంటీ మాత్రం ఇస్తున్నాను. అతి త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోందంటూ ముగించారు.

ముఖ్య అతిథిగా వచ్చిన విలక్షణ నటుడు డా. మోహన్ బాబు మాట్లాడుతూ.. బిడ్డను పొగడొద్దని శాస్త్రం చెబుతుంది. అయితే నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను. అద్భుతంగా నచ్చింది. కానీ నిర్మాత ఎప్పుడూ సెట్స్ కు రావాలి. ఖచ్చితంగా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. లెక్కలు వేసుకోవాలి. సినిమాకు ఎంత ఖర్చవుతుందో అర్థం చేసుకోవాలి. అనవసర ఖర్చును తగ్గించాలి. అప్పుడే మంచి నిర్మాతలుగా ఎదుగుతారు. జయాపజయాలు పక్కన బెడితే, మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ మోసం చేయదు. ఆ మంచితనం వందేళ్లూ ఉంటుంది. నాకు దర్శకుడంటే బాగా ఇష్టం. అతను లేకపోతే సినిమాయే లేదు. ఈ మొదటి సినిమా నీకు గొప్ప విజయం సాధించాలి విజయ్. శ్రీకాంత్ కొన్ని ఫ్రేమ్స్ లో నువ్వు అద్భుతంగా ఉన్నావు. కానీ ఎప్పుడు ఏది చేయాలో భగవంతుడు ముందే నిర్ణయించి ఉంచుతాడు. నాకూ మంచి అవకాశం రావడానికి యేళ్లు పట్టింది. సినిమాలో నటించిన ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్. దర్శక నిర్మాతలకు, నటీనటులకు,  ప్రత్యేక ఆహ్వానితులందరికీ ఆశిస్సులు అందిస్తున్నాను.. అని చెప్పారు.

Wife of Ram Trailer Released:

Wife Of Ram Movie Trailer Release Event Highlights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement