Advertisement

మా ఆవిడ గొప్పగా చెప్పిన చిత్రమిది: రాజమౌళి

Mon 28th Aug 2017 09:20 PM
ss rajamouli,yuddham sharanam,yuddham sharanam audio launch,naga chaitanya,keeravani  మా ఆవిడ గొప్పగా చెప్పిన చిత్రమిది: రాజమౌళి
Yuddham Sharanam Movie Audio Launched మా ఆవిడ గొప్పగా చెప్పిన చిత్రమిది: రాజమౌళి
Advertisement

'యుద్ధం శ‌ర‌ణం' పాట‌ల‌ విడుద‌ల

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మరిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం'. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైదరాబాద్‌లో జ‌రిగింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన పాటల్ని ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి సీడీలను ఆవిష్కరించి రాజమౌళికి అందించారు. ఈ సంద‌ర్భంగా..

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ...'మా ఆవిడకి ఓ పట్టాన ఏదీ నచ్చదు. నా సినిమాలో అయినా పాయింట్‌ నచ్చకపోతే నిర్మొహమాటంగా చెబుతుంది. నా సినిమాలకు తప్ప బయటి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చెయ్యదు. కృష్ణ వచ్చి కథ, క్యారెక్టర్లు వివరించాక.. బాహుబలికి మనం ఎంత ప్రీ వర్క్‌ చేశామో.. కృష్ణ కూడా అంతే చేశాడు. ఈ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అని మొదటిసారి వేరే సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. అప్పుడే ఈ సినిమా మీద నమ్మకం ఏర్పడింది. షూటింగ్‌ చూడ్డానికి సెట్‌కెళితే.. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంటే దానిని కెమెరాతో షూట్‌ చేస్తునట్లుగా అక్కడి వాతావరణం ఉంది. దాంతో నా నమ్మకం మరింత బలపడింది. ఆదివారం మధ్యాహ్నాం ట్రైలర్‌ చూశాక ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందనిపించింది. చైతన్య కథలు ఎంచుకునే తీరు నచ్చింది. విలన్‌గా శ్రీకాంతగారి గెటప్‌ బావుంది. వివేక్‌సాగర్‌ సంగీతం చక్కగా కుదిరింది' అని అన్నారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ..టీజ‌ర్ విడుద‌లైన‌ప్పుడు వ‌చ్చిన పాజిటివ్ రెస్పాన్స్  చూసి మా యూనిట్‌కు ఎంతో బ‌లం వ‌చ్చింది. ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే కార‌ణం సాయి కొర్ర‌పాటిగారే. ఎందుకంటే సినిమాలో 70 శాతం మంది కొత్త‌వారే. కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసే సాయిగారు మమ్మ‌ల్ని ముందుండి నడిపించారు. నాది, ఈ సినిమా డైరెక్ట‌ర్ కృష్ణ‌ది డేట్ ఆఫ్ బ‌ర్త్ ఒక‌టే. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసి చ‌దువుకున్నాం. సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌య్యే ఈ సినిమా యుద్దంలో త‌ను డైరెక్ట‌ర్‌గా గెలిచి నిలుస్తాడు. నికేత్ విజువ‌ల్స్ కార‌ణంగా సినిమాలో అంద‌రూ బాగా క‌న‌ప‌డుతున్నారు. ఓ సామాన్యుడు పవర్‌ఫుల్ విల‌న్‌పై ఎలా గెలిచాడు అన్నది కథ. ఇందులో హీరో ఎక్కడా వెపన్‌ ఉపయోగించడు. వయలెన్స్‌ ఉండదు. సోషల్‌ మీడియా, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్‌ను మాత్రమే తన ఆయుధాలుగా వాడతాడు. వివేక్‌సాగర్‌ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది.సాధార‌ణంగా నా సినిమాల‌కు అభిమానులు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని కలుస్తుంటారు. కానీ నేనే ఈసారి అభిమానుల‌ను వ‌చ్చి క‌లుస్తాను. ఎప్పుడు వ‌స్తాన‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను.. అన్నారు.  

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ..సాయి కొర్ర‌పాటి, నాగ‌చైత‌న్య‌ల‌కు ఆల్ ది బెస్ట్‌. వీరితో పాటు కార్తికేయ‌కు ఆల్ ది బెస్ట్‌. ఎందుకంటే లైన్ ప్రొడ్యూస‌ర్‌గా ఇది త‌న‌కు తొలి సినిమా.పెళ్లిచూపులుకు సంగీతం అందించిన‌ వివేక్‌సాగర్‌ పాటలు కొత్తగా ఉన్నాయి. టీమ్‌కి అభినందనలు..అని చెప్పారు.

సంగీత దర్శకుడు వివేక్‌సాగర్‌ మాట్లాడుతూ..పాటలు బాగా రావడానికి నా ఒక్కడి కృషే కాదు. నా టీమ్‌ అందరి కృషి ఉంది.. అని చెప్పారు. 

డైరెక్ట‌ర్ కృష్ణ ఆర్‌.వి.మారిమ‌త్తు మాట్లాడుతూ - నా త‌ల్లిదండ్రులకు, సిస్ట‌ర్‌కు థాంక్స్‌. చైత‌న్య నా బెస్ట్ ఫ్రెండ్. నన్నెంతో ఎంక‌రేజ్ చేశాడు. నేను ఈరోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నానంటే కార‌ణం చైత‌న్య‌నే. సురేష్‌బాబుగారు ఎంతో గైడ్ చేశారు. సాయికొర్ర‌పాటిగారే అమేజింగ్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. ఆయ‌న‌కు థాంక్స్‌. నా టీంకు థాంక్స్‌.. అన్నారు. 

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఇంట్లోవాళ్ల‌తో యుద్ధం చేస్తూనే ఉన్నాను. స్కూళ్లో పాస్ కావ‌డానికి ఓ యుద్ధం. ఇంట్లోవాళ్ల‌ని మేనేజ్ చేయ‌డానికి ఓ యుద్ధం. ఇలాంటి స‌మ‌యంలో చైత‌న్య చ‌క్క‌గా చ‌దివి పాస‌య్యేవాడు. వాడిని చూసి నేర్చుకోమ‌ని ఇంట్లోవాళ్లు అనేవాళ్లు. అందుకే చైత‌న్య అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి నాకు టార్చ‌రే. ఇక సినిమా గురించి చెప్పాలంటే చైత‌న్య ఎప్ప‌టి నుండో తెలుసో ద‌ర్శ‌కుడు కృష్ణ కూడా అప్ప‌టి నుండే తెలుసు. చైత‌న్య‌కు మంచి ఫ్రెండ్‌. వీరి మ‌ధ్య ఫ్రెండ్‌ఫిప్ కార‌ణంగానే సినిమా బాగా వ‌చ్చింద‌ని అనుకున్నాం. నాకు నా సినిమాలంటే ఎంత ఇష్ట‌మో. చైత‌న్య సినిమాల‌న్నా, అంతక‌న్నా ఎక్కువ ఇష్టం. ఈ సినిమా ఏడాది విడుద‌లైన సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ చిత్రంగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు. 

డి. సురేష్ బాబు, ఎస్‌.ఎస్‌.కార్తికేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్ ను అభినందించారు. 

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మరిముత్తు.

Yuddham Sharanam Movie Audio Launched:

Celebrities talks about Yuddham Sharanam Movie at Audio Launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement