Advertisement

'మహానుభావుడు' అప్ డేట్ ఇచ్చారు!

Thu 17th Aug 2017 07:56 PM
sharwanand,mahanubhavudu,teaser,august 24th  'మహానుభావుడు' అప్ డేట్ ఇచ్చారు!
Mahanubhavudu Movie Teaser Release Update 'మహానుభావుడు' అప్ డేట్ ఇచ్చారు!
Advertisement

అగ‌ష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియోష‌న్స్‌, మారుతి 'మహానుభావుడు' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కి కేరాఫ్ గా మారిన శ‌ర్వానంద్ హీరోగా,  ఒక్క చిత్రంతోనే యూత్ హ‌ర్ట్‌బీట్ గా మారిన మెహ‌రిన్ హీరోయిన్ గా, క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి 'మహానుభావుడు' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఒక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈరోజు నుండి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పొలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. అగ‌ష్టు 24న ఈ చిత్రానికి సంబంధించి మొదటి లుక్ అండ్ మొదటి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ..  ర‌న్ రాజా ర‌న్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌రువాత శ‌ర్వానంద్ హీరోగా చేస్తున్న మూడ‌వ చిత్రం 'మహానుభావుడు'. మారుతి చెప్పిన కేర‌క్ట‌రైజేష‌న్ దాని నుండి వ‌చ్చిన కామెడి చాలా బాగా న‌చ్చి వెంట‌నే చిత్రాన్ని తెర‌కెక్కించాము. ఒక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్త‌యింది. డ‌బ్బింగ్ కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటున్నాము. విదేశాల్లో, ఇండియాలో ని ప‌లు ప్ర‌దేశాల్లో చిత్రాన్ని షూట్ చేశాము. అగ‌ష్టు 24న ఈ చిత్రం మొదటి లుక్ అండ్ మొదటి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తాము. శ‌ర్వానంద్ కి మాబ్యాన‌ర్ లో మ‌రో మంచి చిత్రంగా 'మహానుభావుడు' నిలుస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము.. అని  అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం త‌రువాత నాకు బాగా న‌చ్చిన కేర‌క్ట‌రైజేష‌న్ తొ చేస్తున్న చిత్రం 'మహానుభావుడు'. అన్ని ప‌క్కాగా అనుకున్న‌త‌రువాత ఈ చిత్రం సెట్ మీద‌కి వెళ్ళాము. శ‌ర్వానంద్ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుంద‌ని నమ్మ‌కం వుంది. శ‌ర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. థ‌మ‌న్ సూప‌ర్ ఆడియో అందించాడు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా  ఈ చిత్రం వుంటుంది. అగ‌ష్టు 24న ఈచిత్రం మొదటి లుక్ ని రివీల్ చేస్తున్నాము. ద‌స‌రా కి విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. అని అన్నారు. 

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు..

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి.

Mahanubhavudu Movie Teaser Release Update:

Sharwanand Mahanubhavudu Movie teaser release on august 24th 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement