Advertisement

కేసీఆర్ గారి ఆలోచనలకి ప్రతిరూపం గులాల్..!

Mon 29th May 2017 01:21 PM
kcr,ts,trs,producer laxman konatham,director laxman,gulal movie  కేసీఆర్ గారి ఆలోచనలకి ప్రతిరూపం గులాల్..!
KCR is A Replica Of The Ideas Of Gulal కేసీఆర్ గారి ఆలోచనలకి ప్రతిరూపం గులాల్..!
Advertisement

బందూక్ చిత్రంతో యావత్ తెలంగాణ ప్రజల మనస్తత్వము, మానవీయకోణాలు, ప్రజలలో వున్న ఉద్యమపటిమను కళ్లకు కట్టినట్లు చూపెట్టి  దర్శకుడిగా ప్రశంసలు పొందిన బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం గులాల్. తెలంగాణ విజయం, బంగారు తెలంగాణ నిర్మాణం నేపథ్యంలో  సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ గులాల్ అంటే కేవలం ఒక రంగు మాత్రమే కాదు. 

ఒక విజయం, ఒక సంతోషం, ఒక సంబురం.. విజయానికి గుర్తు. రైతు బాందవుడు, తెలంగాణ సాధకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని అధ్యయనం చేసి, 60 సంవత్సరాల ఆయన జీవితంలో బాల్యం నుండి.. ఎన్నో సవాలను ఎదుర్కొని, తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణం దిశలో సాగుతున తన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ, రైతులు దేశానికి వెన్నుముక, నేటి యువత రేపటి సమసమాజ నిర్మాతలు అని ఆలోచించే కేసీఆర్ గారి ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం గులాల్.కేసీఆర్ గారు తపిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగుతున్న పరిపాలనకు బాసటగా నిలవాలని చేస్తున్న మా ప్రయత్నమిది. 

1956 ఒక చారిత్రాత్మక ఒప్పందం తప్పైతే..2014 ఒక ఒప్పందం చారిత్రాత్మకమయ్యింది.. అనే విషయాలను కూడా ఇందులో చర్చిస్తున్నాం. బందూక్‌లో బిత్‌ల్రేస్ సాంగ్ తరహాలో ఈ చిత్రంలో కూడా పాటలపై ఓ ప్రయోగం చేస్తున్నాం. తెలంగాణలో వాడుకలో వుండి కూడా 18 లిపిలేని తెలంగాణ భాషలతో రైతుల జీవితానికి కేసీఆర్ గారు ఇస్తున్న భరోసాని ఉద్దేశిస్తూ గోరెటి వెంకన్న గారు వ్రాసిన పాటను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. నిర్మాత లక్ష్మణ్ కొణతం మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. పరోక్షంగా సినిమాలకు దగ్గరగా వున్న నాకు నిర్మాతగా ఇది తొలిప్రయత్నం. 

తెలంగాణ విజయం నేపథ్యంలో ఒక సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కేసీఆర్ పోరాట పటిమ, గౌతమబుద్దుడిగా ఆయన ఆలోచనవిధానం, భారత స్వాతంత్య్రంలో మహాత్మగాంధీలా ఉద్యమ స్ఫూర్తి, నెల్సన్‌మండేలా, మార్టిన్ లూధర్ కింగ్‌ల ఆలోచించే ఆయన అనుసరించే విధానం.. బంగారు తెలంగాణ నేపథ్యంలో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో ఓ జాతీయస్థాయి నటుడు ముఖ్యపాత్రను పోషిస్తాడు అని తెలిపారు. 

ఈ చిత్రానికి సాహిత్యం: నందిని సిద్దారెడ్డి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ మాచినేని, స్క్రీన్‌ప్లే-సహకారం; హుస్సేన్ షా కిరణ్, రచనా సహకారం: వెంకట్, మాటలు: అజయ్, లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బందూక్ లక్ష్మణ్. 

KCR is A Replica Of The Ideas Of Gulal:

Gulal movie, Lyrics: Nandini Siddhareddy, Goreeti Venkanna, Suddala Asokhteja, Music: Karthik Kodakundla, Director of Photography: Rahul Machineni, Screenplay-Cooperation; Hussein Shah Kiran, co-author: Venkat, Dialogues: Ajay, Line Producer: Ramesh Maddas, Executive Producer: Sai, Story-Screenplay-Direction: Bandu Lakshman.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement