Advertisement

పూరి..'రోగ్‌' కి సెన్సార్‌ పూర్తయింది..!

Fri 24th Mar 2017 11:43 AM
puri jagannadh,rogue,rogue censor details,rogue release date  పూరి..'రోగ్‌' కి సెన్సార్‌ పూర్తయింది..!
పూరి..'రోగ్‌' కి సెన్సార్‌ పూర్తయింది..!
Advertisement

పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' సెన్సార్‌ పూర్తి - మార్చి 31 విడుదల 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 31న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. 

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement