రామ్ చరణ్ 'ఖైదీ...' డౌట్స్ క్లియర్ చేసాడు!

Tue 03rd Jan 2017 08:20 PM
ram charan,khaidi no 150,mega power star,chiranjeevi,january 11th  రామ్ చరణ్ 'ఖైదీ...' డౌట్స్ క్లియర్ చేసాడు!
రామ్ చరణ్ 'ఖైదీ...' డౌట్స్ క్లియర్ చేసాడు!

జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'ఖైదీ నంబ‌ర్ 150' గ్రాండ్ రిలీజ్, 7న ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ - నిర్మాత‌ రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించిన‌ 'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా వెల్ల‌డించారు. అంత‌కంటే ముందే ఈనెల 7న విజ‌య‌వాడ‌- గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న‌ హాయ్‌ల్యాండ్‌లో ప్రీరిలీజ్ వేడుక‌ను చేస్తున్నామ‌ని తెలిపారు.

ఈ సందర్భ గా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ - ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకేరోజున రావ‌డం ఇండ‌స్ట్రీకి అంత మంచి ప‌రిణామం కాద‌ని నాన్న‌గారు చెప్ప‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నాం. ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ తేదీ మార్పు విష‌యాన్ని గ్ర‌హిస్తార‌ని ఆశిస్తున్నాను. అలాగే.. జ‌న‌వ‌రి 4న జ‌ర‌గాల్సిన 'ఖైదీ నంబ‌ర్ 150' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ గ్రౌండ్ ప‌ర్మిష‌న్ ప్రాబ్లెమ్ కార‌ణంగా జ‌న‌వ‌రి 7న విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో చేస్తున్నాం.. అని తెలిపారు.

'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రంలో మెగాస్టార్‌ సరసన కాజల్ అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, తరుణ్‌ అరోరా విలన్‌గా న‌టించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాట‌లు శ్రోత‌ల మెప్పు పొందిన సంగ‌తి విదిత‌మే.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017