Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-10-16)..!

Thu 20th Oct 2016 06:03 PM
intlo deyyam nakem bayyam first look teaser matter,premam movie thank you meet matter,l7 movie platinum disc function matter,nikhil new movie matter  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-10-16)..!
Advertisement
>'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' టీజర్‌ రిలీజ్‌ 

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశాం. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న మరో సూపర్‌హిట్‌ సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - మంచి కథ, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. అల్లరి నరేష్‌కి, నాకు ఈ సినిమా మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ తర్వాత నరేష్‌ కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది అన్నారు. 

 

>'కేశవ'గా వస్తున్న నిఖిల్

'స్వామి రారా'.. విడుదలైనప్పుడు చిన్న సినిమానే. మాకు ఇటువంటి సినిమాలే కావాలంటూ ప్రేక్షకులు పెద్ద సినిమా చేసి భారీ విజయం అందించారు. ఈ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ జర్నీ మొదలైంది. సుధీర్ వర్మ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఇప్పుడీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కేశవ టైటిల్ ఖరారు చేసినట్టు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, అభిషేక్ పిక్చర్స్ సంస్థ అధినేత అభిషేక్ నామా తెలియజేశారు. 

నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ - హుషారైన ఓ కుర్రాడు ఎవరిపై పగబట్టాడు? అసలు పగ, ప్రతీకారాలంటూ ఎందుకు తిరుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అతి త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది అన్నారు.  

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ - రివెంజ్ డ్రామా స్టోరీ ఇది. నిఖిల్ కొత్త క్యారెక్టర్లో కనిపిస్తాడు. రివెంజ్ డ్రామాలో లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. షూటింగ్ అంతా కాకినాడ నుంచి విశాఖ వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతాం అన్నారు. 

నిఖిల్ సరసన 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ హిందీ హీరోయిన్, కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 'చంద్రలేఖ'లో లేఖగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. , కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

 

>ప్రేమ‌మ్ సినిమా తీయ‌డానికి గ‌ట్స్ కావాలి.. చైత‌న్య అద్భుతంగా న‌టించాడు - నాగార్జున

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. ద‌స‌రా కానుక‌గా రిలీజైన ప్రేమ‌మ్ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. 10 రోజుల్లో 21 కోట్లు షేర్ సాధించింది. 

ఈ సంద‌ర్భంగా ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో  ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... ప్రేమ‌మ్ స‌క్సెస్ సాధించ‌డం చాలా హ్యాపీగా ఉంది. ప్రేమ‌మ్ సినిమా చూసిన వెంట‌నే ఖ‌చ్చితంగా  స‌క్సెస్ అవుతుంది అనే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. వెంట‌నే డైరెక్ట‌ర్ చందుకి కంగ్రాట్స్ చెప్పాను. అలాగే ప్రేమ‌మ్ చూసిన వెంట‌నే చాలా హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను అని ట్వీట్ చేసాను. అలా ట్వీట్ చేసిన వెంట‌నే...కొంత మంది ప్రేమ‌మ్ చూసి హ్యాపీగా ఇంటికి వెళుతున్నారా..?  లేక ఇంటికి వెళుతున్నందుకు హ్యాపీగా ఉన్నారా అని అడిగారు.  ప్రేమ‌మ్ చూడ‌డం వ‌ల‌నే హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను అని చెప్పాను. ప్రేమ‌మ్  క్లైమాక్స్ లో శృతిహాస‌న్ స్వీటు తిని చైతన్య చూసిన‌ప్పుడు నా క‌ళ్లంట నీళ్లు వ‌చ్చాయి. వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ అది. 

ఇలాంటి రీమేక్ చేయ‌డానికి గ‌ట్స్ కావాలి. చందు మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్టు చాలా బాగా తీసాడు. చాలా మంది  చైత‌న్య‌తోనో, అఖిల్ తోనే శివ సినిమా తీయ‌చ్చు కదా అని అంటుంటారు. మ‌ళ్లీ అలాంటి సినిమాను తీయ‌లేం. చంద్ర‌ముఖి సినిమాను ఓరిజ‌న‌ల్ లో ఉన్న‌ట్టే తీస్తే ఆడ‌దు. మ‌న కామెడీ, మ‌న సాంగ్స్, మ‌న క‌ల్చ‌ర్ వేరు. ఆ క‌థ‌లోని సోల్ తీసుకుని చందు మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్టు అద్భుతంగా తీసాడు. ప్రేమ‌మ్ సినిమా రీమేక్ చేస్తున్నాం అన‌గానే త‌మిళ‌నాడు, మ‌ల‌యాళం ఆడియోన్స్ కామెంట్ చేసారు. మ‌న క్లాసిక్ మూవీని వాళ్లు రీమేక్ చేసినా మ‌నం అలాగే కామెంట్స్ చేస్తాం. అయితే...మ‌ల‌యాళం ప్రేమ‌మ్ కంటే గొప్ప‌గా తీద్దాం అని కాదు తెలుగు ఆడియోన్స్ కు ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని అందిద్దాం అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీస్తున్నాం అని చైత‌న్య చెప్పాడు.

ఇక చైత‌న్య గురించి చెప్పాలంటే....నేను బాగా న‌టిస్తే... కొడుకు క‌దా అని నాన్న న‌న్ను పొగిడేవారు కాదు..! కానీ..నేను నా కొడుకును పొగుడుతున్నాను. చైత‌న్య అద్భుతంగా న‌టించాడు. నాకు ఈ వ‌య‌సులోనే గీతాంజ‌లి సినిమా వ‌చ్చింది. ఆ వ‌య‌సులో నేను ఏం చేయ‌గ‌ల‌నో అది చేసాను.  చైత‌న్య కూడా అలాగే చేసాడు అనుకుంటున్నాను. ఈ సినిమాను టీవీలో ఎన్నిసార్లు వేసినా చూస్తేనే ఉంటారు. డైరెక్ట‌ర్ చందు నా ఫ్యాన్ క‌దా...! అందుక‌నే అనుకుంట డైలాగ్స్ బాగా రాసాడు. సైకిల్ చైన్ డైలాగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చివ‌రిలో డైలాగ్ ఉంటుంది క‌దా...కొడుకు సంతోషం క‌న్నా తండ్రికి ఏం కావాలి అని..! ఇప్పుడు అదే చెబుతున్నాను చైత‌న్య స‌క్సెస్ రావ‌డం క‌న్నా నాకు ఇంకేం కావాలి. ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులు అంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

అక్కినేని నాగ చైత‌న్య మాట్లాడుతూ...ప్రేమ‌మ్ రీమేక్ గురించి నాకు ఫ‌స్ట్ ప్రొడ్యూస‌ర్ వంశీ చెప్పాడు. ప్రేమ‌మ్ చూసిన వెంట‌నే నాకు బాగా న‌చ్చింది అందుక‌నే వెంట‌నే ఓకే చెప్పేసాను.  సినిమా రిలీజ్ డేట్ గురించి టెన్ష‌న్ ప‌డ‌కుండా సినిమా బాగా వ‌చ్చింది అని అంద‌రికీ న‌మ్మ‌కం కుదిరిన‌ప్పుడే ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అని నిర్మాత చాలా కేర్ తీసుకున్నారు. రీమేక్ చేయ‌డానికి గ‌ట్స్ కావాలి. ఓరిజ‌న‌ల్ మూవీలోని సోల్ తీసుకుని చందు చాలా బాగా రీక్రియేట్ చేసాడు. చందు నా కెరీర్ కి బిగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్ర‌వీణ్‌, శ్రీనివాస‌రెడ్డి, బ్ర‌హ్మాజీ, న‌ర్రా క్యారెక్ట‌ర్స్ వ‌ల‌న ఎంట‌ర్ టైన్మెంట్ బాగా పండింది. ఈ సినిమా ఇంత‌టి స‌క్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు పి.డి.ప్ర‌సాద్ మాట్లాడుతూ...రీమేక్ చేయ‌డం అంటే సాహ‌సం. మా డైరెక్ట‌ర్ చందు ఈ చిత్రాన్ని మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్టు చాలా బాగా తీసాడు. ప్రేమ‌మ్ ప‌ది రోజుల్లో 21 కోట్లు షేర్ సాధించింది. మూడ‌వ వారంలో కూడా ఇంకా థియేట‌ర్స్ యాడ్ చేస్తున్నాం. కేర‌ళ‌లో కూడా మ‌న ప్రేమ‌మ్ చిత్రాన్ని రిలీజ్ చేసాం. అక్క‌డ‌ మూడు షోలు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో ర‌న్ అవుతుండ‌డం విశేషం. చెన్నైలో మూడ‌వ వారంలో కూడా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈవారంలో చెన్నైలో మ‌రో 6 స్ర్కీన్స్ పెంచుతున్నాం. ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు, అక్కినేని అభిమానుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ చందు మాట్లాడుతూ....ఈ మూవీకి ఇంత‌టి విజ‌యం అందించిన ప్రేక్ష‌కుల‌కు అంద‌రికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో చైత‌న్య టీనేజ్ లుక్ చూసి....ఐదు సంవ‌త్స‌రాల క్రితం షూట్ చేసి ఇప్పుడు యాడ్ చేసారా అని అడుగుతున్నారు. దీనిని బ‌ట్టి చైతు ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇది బెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల‌వుతున్నాను.  ఈ చిత్రంలో న‌టించిన నాగార్జున గార్కి, వెంక‌టేష్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు. 

 

>రాహూల్ మూవీ మేకర్స్ 'ఎల్ 7'

'తుంగభద్ర' ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'. ఈ చిత్ర నిర్మాత గతంలో 'ఈ వర్షం సాక్షిగా' వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోని రిలీజ్ చేసాము. ఆడియో కి మంచి మంచి రెస్పాన్స్ వచ్చ్చింది. మా చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్  ఇవ్వాళా ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఇష్క్' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఈయన గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేశారు. ఈ చిత్రాన్ని 21 వ  తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము అని అన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement