Advertisement

అమ్మోరు, అరుంధతిలా...ఇప్పుడు నాగభరణం!

Tue 18th Oct 2016 12:08 AM
nagabharanam,arundathi,ammoru,malkapuram sivakumar,kodi ramakrishna  అమ్మోరు, అరుంధతిలా...ఇప్పుడు నాగభరణం!
అమ్మోరు, అరుంధతిలా...ఇప్పుడు నాగభరణం!
Advertisement

నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నాగభరణం. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 353 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. త్వరలో మరికొన్ని థియేటర్లను పెంచనున్నాం. తొలి రోజున ఈ సినిమాకు కోటి యాభై రెండు లక్షల వసూళ్లు వచ్చాయి. రెండు రోజున కోటి పన్నెండు లక్షల కలెక్షన్స్‌ను సాధించింది. మూడు రోజుల్లో నాలుగు కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాం. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. గ్రాఫిక్స్ హంగులతో పతాక ఘట్టాల్లో విష్ణువర్ధన్‌ను పునఃసృష్టించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తున్నాయి. విజయం దిశగా సినిమా దూసుకుపోతుండటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ అద్భుతంగా వుంది... అని తెలిపారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement