Advertisement

సంక్రాంతికే మెగాస్టార్ 'ఖైదీ..'...!

Mon 03rd Oct 2016 10:41 PM
khaidi no 150,chiranjeevi,sankranthi,ram charan,vv vinayak  సంక్రాంతికే మెగాస్టార్ 'ఖైదీ..'...!
సంక్రాంతికే మెగాస్టార్ 'ఖైదీ..'...!
Advertisement

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న 'ఖైదీ నంబ‌ర్ 150' సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ  పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. 

నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా 'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం... అన్నారు. 

ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement