Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-9-16)..!

Tue 27th Sep 2016 02:06 PM
hyper censor details,nirmala convent,dasari narayana rao,pilla rakshasi,iddaru iddare trailer launch,mana oori ramayanam movie,house audio launch,tollywood tajaa updates,tollywood tazaa updates,26th september  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-9-16)..!
Advertisement
>1. హైపర్‌  సెన్సార్ పూర్తి.... వ‌ర‌ల్డ్‌వైడ్ గా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హైపర్‌ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....హీరో రామ్ మాట్లాడుతూ - నేను, సంతోష్ శ్రీనివాస్ చేసిన కందిరీగ పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ మా కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. హైపర్ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంక గారు సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించారు.  అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది.. అన్నారు.

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - రామ్, సంతోష్ శ్రీన్ వాస్ ల హైపర్ పాటలకు, రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్సందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ - ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌ ఎనర్జీకి పర్‌ఫెక్ట్‌ గా సరిపోయే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.. అన్నారు.  

>2. నిర్మలా కాన్వెంట్ లో హీరో రోల్ చూస్తుంటే తెరపై నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది - దర్శకరత్న డా.దాసరి నారాయణరావు

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ బేనర్స్‌ పై కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించిన ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి చిత్రం నిర్మల కాన్వెంట్‌. సెప్టెంబర్ 16న సినిమా విడుదలైంది. ఈ సినిమాను రీసెంట్ గా దర్శకరత్న డా.దాసరి నారాయణరావు వీక్షించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ -నిర్మలా కాన్వెంట్ తో ఓ యంగ్ టీం పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మూడో జనరేషన్ పరిచయం అయ్యింది. రోషన్ ఎప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడో ఏమో కానీ అప్పుడే హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, సుమ తనయుడు పరిచయం అయ్యాడు. సాలూరి రాజేశ్వరరావు మనవడు రోషన్ సాలూరి ఈ సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. నా శిష్యుడు ధవళసత్యం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జి.నాగకోటేశ్వరరావు ఈ సినిమాకు పరిచయం అయ్యాడు. ఇప్పటి ట్రెండ్ కి తగిన విధంగా సినిమాను చాలా ఫ్రెష్ లుక్ తో తీశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. లవ్ కోసం చాలెంజ్ చేసిన హీరో నాలెడ్జ్ ను పెంచుకుని ఎలా గెలిచాడనే కాన్సెప్ట్ లో రోషన్ చక్కగా నటించాడు. హీరో క్యారెక్టర్ ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్లుంది. నేను కూడా చిన్న వాడిగా కెరీర్ స్టార్ట్ చేసి 150 సినిమాలు చేసిన దర్శకుడిగా మారాను. గతంలో బాబీ చిత్రంలో రోషన్, శ్రియాశర్మను తెరపై చూస్తంటే రిషికపూర్, డింపుల్ కపాడియాల జోడిని చూసినట్టు అనిపించింది. అలాగే నాగార్జున సెకండాఫ్ లో చాలా మంచి రోల్ చేశాడు. ఇలాంటి ఓ చిత్రానికి నాగార్జున అందించిన సపోర్ట్ అభినందనీయం..అన్నారు.

చిత్ర దర్శకుడు జి.నాగకోటేశ్వరరావు మాట్లాడుతూ -దర్శకులకు స్టార్ ఇమేజ్ తెచ్చిన దాసరి నారాయణరావుగారు నా గురువుకు గురువు. ఈరోజు నా డైరెక్షన్ లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ ను ఆయన అభినందించడం ఆనందంగా ఉంది. రోషన్ ఒక హీరో అయితే సెకండాఫ్ అంతా నాగార్జున గారే హీరో. నాగార్జునగారు అందించిన సహకారం మరచిపోలేనిది. మ్యాట్రిక్స్ ఫ్రసాద్ గారికి థాంక్స్. రెండవ వారం కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్.. అన్నారు. హీరో రోషన్ మాట్లాడుతూ - ఎప్పుడు గురువుగారు దాసరిగారిని టీవీల్లో చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు. ఇప్పుడు ఆయన మా సినిమాను చూసి మమ్మల్ని అభినందించడం ఆనందంగా, ఎగ్జయిటింగ్ గా ఉంది.. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ సాలూరి మాట్లాడుతూ - మా తాతగారు, నాన్నగారు దాసరిగారి వద్ద వర్క్ చేశారు. ఇప్పుడు నేను ఆయన వద్ద పనిచేయకపోయినా ఆశీర్వాదం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజును మరచిపోలేను.. అన్నారు.

>3. దీపావళికి పిల్ల రాక్ష‌సి

బిచ్చగాడు వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి  అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. ఓ  ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌నే కాన్సెప్ట్ తో రూపొంది మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన ఆన్ మ‌రియ క‌లిప్పిలాను తెలుగులో పిల్ల రాక్షసి పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. బిచ్చ‌గాడు చిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ఆ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన ర‌చ‌యిత భాషా శ్రీ మ‌ల‌యాళ చిత్రం ఆన్ మ‌రియ క‌లిప్పిలాను తెలుగు అనువాదానికి మాట‌లు, పాట‌లు అందిస్తున్నారు.  సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

దర్శ‌కుడు మిథున్ మాన్యూల్ థామ‌స్  డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను రియ‌లిస్టిక్‌ పంథాలో ఆవిష్క‌రించారు. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో పాటు,  మ్యాజిక్‌ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా ఉంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.  ఓకే బంగారం ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా,  సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది.  స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

>4. హౌస్ చిత్రం  ఆడియో రిలీజ్ 

జై,వసుంధర జంటగా నటుడు ఉత్తేజ్ శిష్యుడు రాజుశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ  తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ హౌస్. బోయిన క్రిష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్  హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. శాశంక్ బాస్కరుని సంగీతం అందించిన ఈ చిత్రం బిగి సీడిని  నిర్మాత దాము ఆవిష్కరించారు..ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్, నటుడు ఉత్తేజ్, నిర్మాత ముత్యాల రాందాస్, పద్మిని, హీరో మానస్ ముఖ్యఅతిధులుగా హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు..ఉత్తేజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం తోనే సినిమా తీసానని అన్నారు..ఆయనను నిత్యం గమనించడం వల్ల సినిమాకు సంబంధించిన ప్రతి విషయం పై అవగాహాన ఏర్పడిందని ..ఫైనల్ గా దర్శకుడు కావాలనే కల హౌస్ మూవీతో నేరవేరిందని దర్శకుడు రాజ్ శెట్టి తెలిపారు..మా సినిమాకు ఇండస్ట్రీ అతిరథ మహారథులు గెస్ట్ లుగా రావడం మా టీమ్ ను అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు..నా శిష్యుడు రాజు శెట్టి దర్శకుడు అయినందుకు చాలా ఆనందంగా ఉందని ఉత్తేజ్ అంటే..హౌస్ చిత్ర యూనిట్ రిలీజ్ కు ఎటువంటి సహాయం కోరినా సహాకరిస్తామని  దాము, పద్మిని, ముత్యాలరాందాస్ తెలిపారు..

నటీనటులు : జై, వసుంధర, యోగేష్, కౌశిక, కవిత, సందీప్, ఆర్కే, బాష, సినిమాటోగ్రఫి: మహేష్ మట్టి, ఎడిటర్: ధీరజ్ ఆర్ట్స్, సంగీతం: శాశాంక్ భాస్కరుని , నిర్మాత:బొయన క్రిష్ణంరాజు, కథ , మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజు శెట్టి

>5. మోహన్‌లాల్‌-సత్యరాజ్‌ ఇద్దరూ ఇద్దరే

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, తమిళ టాప్‌ స్టార్‌ సత్యరాజ్‌, బ్యూటీక్వీన్‌ అమలాపాల్‌ మలయాళంలో నటించగా ఘనవిజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాదంగా వస్తున్న చిత్రం ఇద్దరూ ఇద్దరే. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్‌, ఊపిరి తాజాగా మజ్ను వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిసుందర్‌ ఇద్దరూ ఇద్దరే చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌, బెక్కెం వేణుగోపాల్‌, లోహిత్‌, శోభారాణి, సాయివెంకట్‌ తదితర చిత్ర ప్రముఖుతోపాటు నిర్మాత కందల  కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ డి.నారాయణ, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్‌ చంద్రశేఖర్‌, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రైలర్‌ విడుదల అనంతరం వక్తలు మాట్లాడుతూ.. మిర్చి, బాహుబలి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సత్యరాజ్‌, మనమంతా, జనతా గ్యారేజ్‌ చిత్రాలతో తెలుగులో మరింత పాపులరైన మోహన్‌లాల్‌, రాంచరణ్‌ నాయక్‌, రఘువరన్‌ బి.టెక్‌, మేము వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అమలాపాల్‌ నటించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇద్దరూ ఇద్దరే తెలుగులోనూ ఘన విజయం సాధించడం ఖాయమని, గోపిసుందర్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.

స్వతహా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్‌ అయిన తాను.. ఇద్దరూ ఇద్దరే అనంతరం తెలుగులో స్ట్రయిట్‌ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని, ఇద్దరూ ఇద్దరే చిత్రం అన్ని ఏరియాల బిజినెస్‌ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యిందని చిత్ర నిర్మాత కందల కృష్ణారెడ్డి అన్నారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ డి.నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, అక్టోబర్‌ ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేయనున్నామని అన్నారు.

రమ్య నంబీసన్‌, సోనూసూద్‌, పృథ్వి తదితరులు  ఇతర ముఖ్య పాతలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.లోకనాధన్‌, ఎడిటింగ్‌: శ్యాం శశిధరన్‌, పబ్లిసిటీ డిజైనర్‌: వెంకట్‌ ఎం., మాటలు - పాటలు: రామకృష్ణ, సంగీతం: గోపిసుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.నారాయణ, నిర్మాత: కందల కృష్ణారెడ్డి, దర్శకత్వం: జోషి.

>6. అక్టోబర్ 7న మనవూరి రామాయణం విడుదల 

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మనవూరి రామాయణం. అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించిన వివరాల్లోకి వెళితే ....శ్రీ రామనవమి పండగరోజున జరిగే ఒక సంఘటనతో ఈ మనఊరి రామాయణం చిత్ర కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథ రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా  ఉంటుంది. రాముడి రూపంలో ఉండే రావణుడి కథే ఇది. ఈ చిత్ర కధనం అంతా కూడా వ్యక్తుల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

భుజంగయ్య (ప్రకాష్ రాజ్) అనే వ్యక్తి దుబాయ్‌లో బాగా సంపాదించి వచ్చి ఇక్కడ ఓ ఊరిలో బిజినెస్‌ పెట్టుకుంటాడు. చిత్రంలో సుశీల (ప్రియమణి), ఆటోవాలా శివ (సత్యదేవ్) ల తో పాటు ఎప్పటికైనా భుజంగయ్య దుబాయ్‌కి పంపిస్తాడనే ఆశతో ఆటోవాలా ఉంటాడు. గరుడ అనే డైరెక్టర్‌కు (పృథ్వి)  మంచి సినిమా తీయాలని వస్తాడు. భుజంగయ్య, సుశీల, ఆటోవాలా, గరుడ అనే నలుగురి మధ్య ఈ కథ నడుస్తూ ఉంటుంది. వీరిమధ్య నడిచే భావోద్వేగాలు, ఒక్కొక్కరు ఎవరికి వారు ఎలా తమ జీవితాన్ని తమ తమ పరిధిమేరకు నడిచారో, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారారో తెలుపుతుంది. 

ఈ నలుగురికి పాత్రల చుట్టూ తిరుగుతూనే రామాయణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ వారి వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి

హరికథలో చెప్పిన విధంగా రావణుడు.. రాముడిగా మారినప్పుడు హనుమంతుడితో రాముడిని చంపమని సీత చెప్పినపుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడా..! రాముడిని చంపాడా..! అనే విధంగా ఈ పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అదే మనఊరి రామాయణం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement