Advertisement

దాసరి..శ్రీరస్తు శుభమస్తు బ్రాండ్ అంబాసిడర్!

Mon 15th Aug 2016 11:54 AM
srirastu subhamastu success meet,dasari narayana rao,brand ambassador,sukumar,vv vinayak,parasuram  దాసరి..శ్రీరస్తు శుభమస్తు బ్రాండ్ అంబాసిడర్!
దాసరి..శ్రీరస్తు శుభమస్తు బ్రాండ్ అంబాసిడర్!
Advertisement

ఇలాంటి సినిమాలకు బ్రాండ్ గా మారతా! - దర్శకరత్న 

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. ఈ సందర్బంగా ఆదివారం హైద్రాబాద్ లో చిత్ర సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు, వి వి వినాయక్, సుకుమార్, నందిని రెడ్డి లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ .. ఈ సినిమా చూసి ఎదో ఓ ఛానల్ కు కాంప్లిమెంట్ ఇస్తానని అరవింద్ కు చెప్పా, కానీ అలా కాదండి మీరు ఈ కార్యక్రమానికి రావాలని ప్రెస్ మీట్ పెట్టారు. నేను దర్శకత్వం వహించిన బంట్రోతు భార్య సినిమాతోనే గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రారంభం అయింది. గత 45 సంవత్సరాలుగా విజయవంతంగా సినిమాలు తీయడం గొప్ప విషయం. నేను రూపొందించిన మాయాబజార్ సినిమాతో అల్లు అర్జున్ ని బాలా నటుడిగా పరిచయం చేశాను. ఇది చాలా మందికి తెలియదు. నిజానికి అర్జున్ కంటే కూడా శిరీష్ నే హీరో చేయాలనీ అల్లు రామలింగయ్య అనుకునే వారు. శిరీష్ మంచి క్రమశిక్షణ ఉన్న నటుడు. చిరంజీవి అడుగుజాడల్లో నడవడం వల్లనో, అరవింద్ పెంపకం వల్లనో మంచి క్రమశిక్షణ వచ్చింది. ఇక ఇలాంటి సినిమాలను చూసినప్పుడు వీటిని నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సినిమా పరిశ్రమ బాగుండాలంటే  చిన్న సినిమాలు బ్రతకాలి.  పెద్ద సినిమాలు ఎలాగూ ఆడతాయి, అందరు చిన్న సినిమాల నుండే పైకి వచ్చిన వారు, కానీ ఇప్పుడు చాలా వరకు సినిమాలను ఫ్యామిలీ తో కలిసి చూడలేని పరిస్థితికి చేరుకున్నాం. కానీ ఈ మధ్య కొన్ని సినిమాలు అందరు మెచ్చేలా ఉంటున్నాయి. భలే భలే మగాడివోయ్, ఊపిరి , మనమంతా , పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలు కంటెంట్ బేస్డ్ గా వస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ విషయంలో దర్శకుడు పరశురామ్ ను అభినందించాలి.  ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాను చూసిన ప్రతి అబ్బాయి, అమ్మాయి తమ ప్రేమను గెలిపించుకోవడం తో పాటు పెద్దల అంగీకారం కూడా తీసుకోవాలనే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. లావణ్య చాలా చక్కగా నటించింది. ఈ సినిమా విజయంలో పలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను అన్నారు. 

వి వి వినాయక్ మాట్లాడుతూ .. ఫ్యామిలీ అంతా చూసే సినిమా ఇది. పరుశురాం మరోసారి మంచి రచయితగా ప్రూవ్ చేసుకున్నాడు. క్లైమాక్స్ త్రివిక్రమ్ స్టైల్ లో డైలాగ్స్ రాసాడు. శిరీష్ పెద్ద బిజినెస్ మెన్ అవుతాడని అనుకున్నాను కానీ హీరో అయ్యాడు. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ తో సమానంగా డైలాగ్స్ చెప్పడం తనకు పెద్ద అఛీవ్మెంట్ అని చెప్పాలి.  బన్నీ లా డాన్స్ చేస్తాడని, చిరంజీవి లా ఫైట్స్ చేస్తాడని అనుకుంటే .. డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు అన్నారు. 

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ .. శిరీష్ హీరో అవుతాడని బహుశా నాకే ముందు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నాకు ఆ విషయాన్నీ చెప్పారు. శిరీష్ బన్నీ లా కాకుండా లవర్ బాయ్, పక్కింటి కుర్రాడిగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్ ..ముఖ్యంగా క్లైమాక్స్ లో త్రివిక్రమ్ స్టయిల్ లో డైలాగ్స్ రాసాడు అన్నారు. 

అల్లు శిరీష్ మాట్లాడూతూ .. ఓ మంచి హిట్ సినిమా అనేది డైరెక్టర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. నాకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు పరశురామ్ గారికి థాంక్స్ అన్నారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement