Advertisement

పాటలు వింటూ ఏడ్చేశాను: నాగ్

Sat 18th Jun 2016 05:14 PM
sahasam swasaga sagipo audio,nagachaitanya,gowtham menon,rehman  పాటలు వింటూ ఏడ్చేశాను: నాగ్
పాటలు వింటూ ఏడ్చేశాను: నాగ్
Advertisement

నాగ చైతన్య, మంజిమ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో'. కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యం.రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. అక్కినేని నాగార్జున, గోపీచంద్ బిగ్ సీడీను ఆవిష్కరించగా.. ఏఆర్ రెహ్మాన్ ఆడియో సీడీలను విడుదల చేశారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సంధర్భంగా.. 

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''రెహ్మాన్ గారి మ్యూజిక్ కు ఈ కార్యక్రమంలోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. చైతు నెల రోజుల క్రితం ఈ సినిమా పాటలను వినమని సీడీ ఇచ్చాడు. నాకు ఒంటరిగా మ్యూజిక్ రూమ్ లో పాటలు వినడమంటే చాలా ఇష్టం. పాటలు వింటున్నంతసేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. రెహ్మాన్ మ్యూజిక్ అధ్బుతం. గౌతమ్ మీనన్ నాతో ఎప్పుడు సినిమా చేస్తాను అంటాడు కానీ చేయట్లేదు. ఒకరోజు వచ్చి నెగెటివ్ రోల్ లో నటిస్తారా..? అనడిగారు. మీ దర్శకత్వంలో అయితే సిద్ధమే అన్నాను. కానీ మళ్ళీ మాయమైపోయారు. నా కొడుకు చైతుతో సినిమాలు చేస్తున్నందుకు సంతోశంగా ఉంది. నాతో కూడా త్వరలోనే సినిమా చేస్తాడని ఆశిస్తున్నాను. తన సినిమాలు చాలా బావుంటాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బావుంటుంది. నాకు ఈ సినిమా టైటిల్ అంటే చాలా ఇష్టం. నేను నమ్మే సూత్రమిది'' అని చెప్పారు. 

గోపిచంద్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాత రవీందర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు. గౌతమ్ మీనన్ గారిని 5 ఏళ్ల క్రితం కలిశాను. ఇండస్ట్రీలో ఉన్న స్టయిలిష్ డైరెక్టర్ ఆయన. రెహ్మాన్ గారి పాటలు అధ్బుతంగా ఉన్నాయి. విజువల్స్ లో చైతు కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావాలి'' అని చెప్పారు. 

రెహ్మాన్ మాట్లాడుతూ.. ''పాటల్లో ఓ కొత్త అటెంప్ట్ ను ప్రయత్నిచాం. దాంతో మ్యూజిక్ లో రిచ్ నెస్ కనిపిస్తోంది. మంచి సాహిత్యాన్ని అందించిన లిరిసిస్ట్స్ కు కృతజ్ఞతలు'' అని చెప్పారు

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''గౌతమ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చైతును చూస్తుంటే 'గీతాంజలి' సినిమాలో నాగార్జున గారిని చూసినట్లుంది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు. 

నాగ చైతన్య మాట్లాడుతూ.. ''రెహ్మాన్ గారితో ఒక్కసారైనా పని చేయాలని చాలా మంది కోరుకుంటారు. గౌతమ్ మీనన్ గారి వల్ల నాకు ఆ అవకాశం రెండు సార్లు వచ్చింది. సక్సెస్ ఇచ్చిన దర్శకులతో మళ్ళీ మళ్ళీ పని చేయాలనుకుంటారు. గౌతమ్ మీనన్ గారితో మరో సినిమా చేసే అవకాశం రావడం అధృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో పని చేస్తున్న ప్రతి సారి ఏదొకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఏ మాయ చేసావే సినిమాతో నా కెరీర్ కు ఒక దారి వచ్చింది. ఈ సినిమాతో మరొక చాప్టర్ ఓపెన్ అవుతుందని నమ్ముతున్నాను. జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. 

దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ''చాలా ఆనందంగా, ప్రౌడ్ గా ఉంది. రెహ్మాన్ అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చాడు. చైతు, మంజిమ చక్కగా నటించారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అని చెప్పారు. 

అఖిల్ మాట్లాడుతూ.. ''సింగర్స్ అధ్బుతంగా పాడారు. రెహ్మాన్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంట. అన్నయ్య ఏదైనా నమ్మి చేస్తాడు. తన నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ''చైతు నిజ జీవితంలో కూడా హీరోనే. ఈ సినిమా మొదలు పెట్టి 14 నెలలు అవుతున్నా.. ఏ ఒక్క రోజు తన డేట్స్ విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రెహ్మాన్ గారు మాకు ఇన్స్పిరేషన్. గౌతమ్ మీనన్ గారితో కలిసి వర్క్ చేయడం సంతోశంగా ఉంది'' అని చెప్పారు. 

కోన వెంకట్ మాట్లాడుతూ.. ''రెహ్మాన్, గౌతమ్ మీనన్ లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం సంతోశంగా ఉంది. చైతు, మంజిమ తన నటనతో మ్యాజిక్ చేసే ఉంటారు'' అని చెప్పారు. 

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''ప్రతి పాట అధ్బుతంగా ఉంది. ఏ మాయ చేసావే సినిమా కంటే ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుంది. చైతు తనకంటూ.. ఓ దారి వేసుకున్నాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

సురేశ్ బాబు మాట్లాడుతూ.. ''రెహ్మాన్ తన సంగీతంతో ఆనందం కలిగిస్తాడు. సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''రెహ్మాన్ గారి పాటలు వింటుంటే లైవ్ లో విన్నట్లు ఉంది. సాంగ్స్ వింటుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. అర్ధమవుతుంది. ఏ మాయ చేసావే మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందని భావిస్తున్నాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రేజీనా, సాయి ధరం తేజ్, అనంత శ్రీరామ్, కళ్యాణ్ కృష్ణ, బాబీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement