Advertisement

'బ్రాహ్మణ' ట్రైలర్ లాంచ్!

Fri 17th Jun 2016 02:36 PM
brahmana movie trailer launch,srinivas raju,thummalapalli ramasathyanarayana  'బ్రాహ్మణ' ట్రైలర్ లాంచ్!
'బ్రాహ్మణ' ట్రైలర్ లాంచ్!
Advertisement

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'శివం'. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని శ్రీతారక పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్, గుర్రం మహేశ్ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

ఈ సంధర్భంగా..

నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. కన్నడలో ఈ సినిమా చూశాను. అక్కడ సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ.. ''ఉపేంద్ర గారి సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మాసివ్ గా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్స్ మాసివ్ గా, స్టైలిష్ గా ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''ఉపేంద్ర గారికి కన్నడలో ఎంత మార్కెట్ ఉందో.. తెలుగులో కూడా అంతే మార్కెట్ ఉంది.  జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మా బ్యానర్ భీమవరం టాకీస్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో 150 నుండి 175 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. కన్నడ కంటే తెలుగులో ఇంకా.. పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. ''కన్నడలో సంచలనం సృష్టించిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నందుకు సంతోశంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది'' అని చెప్పారు. 

నిర్మాతలు మాట్లాడుతూ.. ''కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు తెలుగులో గల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. అదే నమ్మకంతో ఆయన కన్నడలో నటించిన చిత్రాన్ని తెలుగులో 'బ్రాహ్మణ' అనే పేరుతో విడుదల చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుగులో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫి: వెంకట ప్రసాద్, ఎడిటర్: వినోద్ మనోహర్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: గుంటూరు కేశవులు నాయుడు, సమర్పణ: సి.ఆర్.మనోహర్, నిర్మాతలు: విజయ్.ఎమ్, గుర్రం మహేశ్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాజు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement