Advertisement

'వైశాఖం' సినిమా అరవై శాతం పూర్తి!

Mon 30th May 2016 01:30 PM
vaishakham movie,60 percent shooting completed,jaya,b.a.raju  'వైశాఖం' సినిమా అరవై శాతం పూర్తి!
'వైశాఖం' సినిమా అరవై శాతం పూర్తి!
Advertisement

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె సినిమాస్ బ్యానర్ పై బి.జయ దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తోన్న చిత్రం 'వైశాఖం'. ఈ సినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. '' 'ప్రేమలో పావని కళ్యాన్','చంటిగాడు', 'ప్రేమికులు', 'లవ్లీ' వంటి చిత్రాల తరువాత మా సంస్థలో రాబోతోన్న మరో చిత్రం 'వైశాఖం'. లవ్లీ సినిమా తరువాత మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్యాప్ తీసుకున్నాం. వైశాఖం కథ నచ్చి షూటింగ్ మొదలుపెట్టాం. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది. మా బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సారి 'వైశాఖం' పాటలను కొత్త లోకేషన్స్ లో చిత్రీకరించాలని ఎన్నో ప్రాంతాలను సెర్చ్ చేసి చివరగా కజక్ స్థాన్ లో 15 రోజుల పాటు మూడు పాటలను చిత్రీకరించారు. హై బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది'' అని చెప్పారు.

దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ.. ''కంట్రోల్డ్ బడ్జెట్ లో చాలా కూల్ గా ఈ సినిమా చేయాలనుకున్నాను. కాని అంతా రివర్స్ అవుతుంది. ఎందుకంటే కథ విషయంలో నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేను. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త లోకేషన్స్ ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. దానికి కోసం కజక్ స్థాన్ వెళ్లి పాటలను చిత్రీకరించాం. ప్రతి షాట్ అధ్బుతంగా వచ్చింది. సాంగ్స్ కోసం సుమారుగా 19 లోకేషన్స్ కు పైగానే తిరిగాం. వసంత్ గారు అధ్బుతమైన మ్యూజిక్ కు తగ్గట్లుగా పిక్చరైజేషన్ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద నడిచే కథ ఇది. ఒక అపార్ట్మెంట్ లో ఉన్నవారంతా కలిసి ఉమ్మడి కుంటుంబంలా ఉంటే ఎంత బావుంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు మొదటినుండి అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టాలని భావించాను. అందుకే 'వైశాఖం' అనే పేరును సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కథను సెంటిమెంట్ కంటే ఎంటర్టైన్మెంట్ వే లో చూపించబోతున్నాం'' అని చెప్పారు.

వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. ''ఫిలిం మేకింగ్ కోసం రోబోటిక్స్ ను ఉపయోగిస్తున్నాం. అధ్బుతమైన లోకేషన్స్ లో సినిమాను చిత్రీకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.

హరీష్ మాట్లాడుతూ.. ''సోలో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను నమ్మి హీరోగా సెలక్ట్ చేసుకున్న దర్సకనిర్మాతలకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.

వి.జె.శేఖర్ మాట్లాడుతూ.. ''ఈ బ్యానర్ లో వచ్చిన లవ్లీ సినిమాకు పని చేశాను. మరోసారి ఈ సినిమా కోసం వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అందరూ కష్టపడి పని చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, స్టిల్స్: శ్రీను, కో డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన-దర్శకత్వం: జయ బి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement