Advertisement

'కృష్ణాష్టమి' మూవీ సక్సెస్ మీట్!

Tue 23rd Feb 2016 05:20 PM
krishnashtami success meet,sunil,vasu varma,dil raju  'కృష్ణాష్టమి' మూవీ సక్సెస్ మీట్!
'కృష్ణాష్టమి' మూవీ సక్సెస్ మీట్!
Advertisement

సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చొపాడే ప్రధానపాత్రల్లో వాసు వర్మ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం 'కృష్ణాష్టమి'. ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి ఐదు రోజులయ్యింది. రెవెన్యూ పరంగా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. సునీల్ ఈ సినిమా బాగా ఎఫర్ట్ పెట్టాడు. తన భుజస్కందాలపై సినిమాను నడిపించాడు. మంచి మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు'' అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ.. ''మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వలనే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రాజు గారు లేకపోతే ఈ సినిమానే లేదు. నా లైఫ్ లో నేను చేసిన అన్ని సినిమాల కంటే భారీ బడ్జెట్ సినిమా ఇది. వాసు గారు లేకపోతే ఈ సినిమాకు అంత అందం వచ్చేది కాదు. కొత్తగా కామెడీను ఎలా పండించాలి.. ఎలా తీస్తే బావుంటుందని ఆలోచించి ఈ సినిమా తీశారు. దినేష్ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

వాసు వర్మ మాట్లాడుతూ.. ''రిలీజ్ రోజు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఒక రూం లో ఎవరితో మాట్లాడకుండా కామ్ గా కూర్చున్నాను. సినిమా మొదటి షో రిజల్ట్ తెలియగానే ఊపిరి పీల్చుకున్నాను. రోజు రోజుకీ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ను క్లాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే సెకండ్ హాఫ్ మాత్రం మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఎదుటివారి మొహంలో సంతోషం చూడడానికే ఎంతదూరమైన వెళ్ళచ్చనే కాన్సెప్ట్ తో సినిమా తీశాను. సునీల్ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. సినిమా థియేటర్ లోనే కుర్చుంటున్నా. థియేటర్ లో ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ మరెవరు ఇవ్వలేరు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో డింపుల్ చొపాడే, నిక్కీ గల్రాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement