Advertisement

నవ్వు విలువ తెలిసింది:హను రాఘవపుడి

Mon 15th Feb 2016 03:19 PM
krishnagadi veeraprema gada,nani,hanu raghavapudi  నవ్వు విలువ తెలిసింది:హను రాఘవపుడి
నవ్వు విలువ తెలిసింది:హను రాఘవపుడి
Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 

నాని మాట్లాడుతూ.. ''డిస్ట్రి బ్యూటర్ ఒకాయన ఫోన్ చేసి సినిమాను ప్రేక్షకులు వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో ప్రతి పాత్ర కథను నడిపించింది. నాకు, మురళి శర్మ గారికి, పృథ్వి గారికి కాంబినేషన్ సీన్స్ లేవు కాని ఒకరివలన మరొకరి జీవితాలు మారిపోతాయి. శత్రుకి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఫ్యూచర్ లో తను పెద్ద నటుడు అవుతాడు. మహాలక్ష్మి అన్న పాత్రలో అధ్బుతంగా నటించాడు. పృథ్వీ గారి ఆర్కెస్ట్రా అదిరింది. మెహరీన్ చాలా చక్కగా నటించింది. సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు నేరుగా వెళ్లి థాంక్స్ చెప్పుకోనున్నాం'' అని చెప్పారు.

హను రాఘవపుడి మాట్లాడుతూ.. ''ఈరోజు నేనున్నంత సంతోషంగా మరెవరు ఉండరేమో..! 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' అందరికి నచ్చుతుందనే నమ్మకంతో సినిమాను మొదలుపెట్టాను. నా నమ్మకం నిజమైంది. ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతాయే కాని తగ్గవని నాని చెప్పాడు. అలానే జరుగుతుంది. ఆర్టిస్ట్స్ అందరూ తమ పనికి మించి ఎక్కువ వర్క్ చేశారు. నేను ఎలా అనుకున్నానో అలా తీయడానికి ప్రొడ్యూసర్స్ ఎంతగానో సహకరించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ బాధ్యత అంతా తన భుజాలపై వేసుకొని నడిపించాడు. లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ఈ సినిమాను నాని హీరోగా మాత్రమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ తో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. నవ్వుకు ఉన్న విలువ తెలిసింది'' అని చెప్పారు.

గోపి ఆచంట మాట్లాడుతూ.. ''సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. మా టీం అందరం కలిసి సక్సెస్ టూర్ కి వెళ్తున్నాం. ముందుగా నైజాం వెళ్లి అక్కడ నుండి వైజాగ్ వెళ్ళనున్నాం. ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది'' అని చెప్పారు.

మెహరీన్ మాట్లాడుతూ.. ''అందరికి నా వర్క్ నచ్చింది. నా మీద నమ్మకంతో మహాలక్ష్మి పాత్రలో నటించే అవకాసం ఇచ్చిన హను గారికి థాంక్స్. నా మొదటి సినిమాలో సీనియర్ నటులతో నటించడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శత్రు, రామరాజు, రాజేష్, పృథ్వి, అనిల్ సుంకర, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: గౌతం రాజు, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హను రాఘవపుడి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement