Advertisement

ఫిబ్రవరి 12న 'లిటిల్ స్టార్స్'విడుదల!

Sun 07th Feb 2016 07:28 PM
little stars release date,rasheed basha,mohammad afan  ఫిబ్రవరి 12న 'లిటిల్ స్టార్స్'విడుదల!
ఫిబ్రవరి 12న 'లిటిల్ స్టార్స్'విడుదల!
Advertisement

మాస్ట‌ర్ మ‌హ్మ‌ద్ అఫాన్ స‌మ‌ర్ప‌ణ‌లో హెచ్‌.డి.విజ‌న్ ఇండియా బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం లిటిల్ స్టార్స్‌. త‌స్లీమ్‌దివిజ‌,శ్రేష్ఠ‌,చ‌ర‌ణ్‌హ‌ర్ష త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రాన్ని ర‌షీద్ బాషా ద‌ర్శ‌క‌త్వంలో ఇబ్ర‌హీం షేక్‌అమీర్ బాషా షేక్ఖాజాబి షేక్‌,న‌జీమ్ షేక్ నిర్మించారు. ఈ సినిమా ఫిభ్ర‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌ర్శ‌కుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ''చిల్డ్ర‌న్ పిలిం ఫెస్టివ‌ల్‌ను చూసి ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని పిల్ల‌ల సినిమా తీయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. అందుకోసం చిన్న‌పిల్లల‌ను సెల‌క్ట్ చేసి వారికి వ‌ర్క్ షాప్ నిర్వహించాం. చిన్న‌పిల్ల‌లే ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించ‌డం విశేషం. ఆరుగురు స్నేహితులు త‌మ స్నేహితురాలి కోసం ఏం చేశార‌నేదే సినిమా'' అన్నారు.

వేద‌కుమార్ మాట్లాడుతూ.. ''క‌థాంశాలు ప‌రంగా తెలుగు చిత్ర‌సీమ ఎద‌గాల్సిన అవ‌స‌ర‌ముంది. బాల‌ల చిత్రానికి త‌గినంత ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. చిన్న పిల్ల‌ల చిత్రాల‌కు పెద్ద పీట వేయాల్సిన అవ‌ర‌సం ఉంది. మ‌న‌దేశంలోని పిల్ల‌ల భావాల‌ను కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒప్పించి బాల‌ల చిత్రోత్స‌వాల‌కు హైద‌రాబాద్‌ను శాశ్వ‌త వేదిక‌గా ఏర్పాటు చేశాం'' అన్నారు.

భ‌గీర‌థ మాట్లాడుతూ.. ''తారే జమీన్‌ప‌ర్‌భ‌జ‌రంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాల్లో అమీర్ ఖాన్‌స‌ల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు చేయ‌డం వ‌ల్ల ఆ సినిమాలు పెద్ద విజ‌యాలు సాధించాయి. తెలుగులో చిన్న‌పిల్ల‌లు చిత్రాలు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలు చేయూత‌నివ్వాల్సిన అవ‌ర‌సం ఎంతైనా ఉంది'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కిష‌న్ సాగ‌ర్‌ఇబ్ర‌హీం షేక్‌అమీర్ బాషా షేక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః కిష‌న్ సాగ‌ర్‌ఎడిటింగ్ః నివాస్‌సంగీతంః శ్రీవెంక‌ట్‌నిర్మాత‌లుః ఇబ్ర‌హీం షేక్‌అమీర్ బాషా షేక్‌,ఖాజాబి షేక్‌న‌జీమ్ షేక్‌క‌థ‌స్క్రీన్‌ప్లేద‌ర్శ‌క‌త్వంః ర‌షీద్ బాషా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement