Advertisement

సంక్రాంతికే 'సోగ్గాడే చిన్నినాయనా': నాగార్జున!

Sat 26th Dec 2015 06:43 PM
soggade chinninayana audio release,nagarjuna,ramyakrishna,kalyan krishna,lavanya tripathi  సంక్రాంతికే 'సోగ్గాడే చిన్నినాయనా': నాగార్జున!
సంక్రాంతికే 'సోగ్గాడే చిన్నినాయనా': నాగార్జున!
Advertisement

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, రామ్మోహన్.పి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. రాఘవేంద్రరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీను నాగార్జున కు అందించారు. ఈ సందర్భంగా..

నాగార్జున మాట్లాడుతూ.. ''మనం సినిమా రిలీజ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలయ్యింది. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ సినిమా తరువాత చేయబోయే సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని ఆలోచించి ఈ సినిమా చేశాం. నాన్నగారు ఆత్మీయత, అనురాగం, చక్కటి పంచెకట్టుతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అటువంటి ఎలిమెంట్స్ కి 'హలో బ్రదర్' లాంటి ఎంటర్టైన్మెంట్ జోడిస్తే ఎలా ఉంటుందో అదే 'సోగ్గాడే చిన్నినాయనా'. సినిమాలో ప్రతి ఆట, మాట, సన్నివేశం ఎంటర్టైన్మెంట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటాయి. కొత్త వాళ్ళను ప్రోత్సహించడానికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు నా దగ్గరకి వస్తే అండగా ఉంటాను. కళ్యాణ్ కృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్. ప్రతి డైలాగ్ చక్కగా రాశాడు. రామ్మోహన్ రెండు టేక్స్ లో చెప్పిన కథను డెవలప్ చేసి ఈ సినిమా చేశాం. అక్కినేని అభిఒమానులు మాకు ఇప్పటివరకు అండగా ఉన్నారు. ఇక మీదట కూడా ఉంటారని ఆశిస్తున్నాను. సంక్రాంతి తెలుగు వాళ్లకు ఇష్టమైన పండగ. ఆ పండగంతా ఈ సినిమాలో ఉంటుంది. 2016 జనవరి 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం'' అని చెప్పారు.  

నాగచైతన్య మాట్లాడుతూ.. ''నాన్నగారు ఇంట్లో ఎప్పుడూ సినిమాను ఫ్యామిలీ మెంబర్ లా కేర్ తీసుకోవాలని చెప్పేవారు. ఈ సినిమాను అంతే జాగ్రత్త తీసుకొని చేశారు. 'మనం' సినిమా తరువాత వస్తోన్న ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నాన్నగారు నటించిన 'హలో బ్రదర్' , 'నిన్నే పెళ్ళాడతా' సినిమాల విధంగా ఈ సినిమా కూడా నిలిచిపోతుంది. ఒక ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. కళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్ దర్శకుడు. అనూప్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ''కొన్ని సినిమాల ట్రైలర్స్, టీజర్స్ చూస్తే మంచి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. 'మనం' సినిమా తరువాత నాకు ఈ సినిమా అంత పాజిటివ్ గా అనిపిస్తుంది. 25 సంవత్సరాల క్రితం నాన్న ఎంత ఎనర్జిటిక్ గా నటించారో.. ఇప్పుడు అంతే ఎనర్జిటిక్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ నాకు కొన్ని రషెస్ చూపించాడు. సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాం. నాన్నను పంచెకట్టులో చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందనుకున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది'' అని చెప్పారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''నాగార్జున పంచెకట్టు చూస్తుంటే 'దసరా బుల్లోడు' సినిమాలోని నాగేశ్వరావు గారిలా కనిపిస్తున్నాడు. దసరా బుల్లోడు కంటే ఈ సినిమా డబుల్ హిట్ అవుతుంది. నాగార్జున చేతిలో ఒక పక్క కర్ర, మరోపక్క బాహుబలి శివగామి ఉన్నారు. 'భలే భలే మగాడివోయ్' లావణ్య త్రిపాఠి కూడా ఉంది. సినిమాలో హంసా నందిని ఉందంటే ఇంకా తిరుగులేదనే చెప్పాలి'' అని చెప్పారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ''చాలా రోజుల తరువాత నాగార్జున గారితో కలిసి నటిస్తున్నాను. బంగార్రాజు పాత్రలో నాగార్జున చాలా క్యూట్ గా ఉంటారు. సినిమాలో బంగార్రాజు చెప్పే డైలాగ్స్ హైలైట్స్ గా నిలుస్తాయి. సినిమా అంతా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కళ్యాణ్ కృష్ణ భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడు. సినిమా బిగ్గెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది'' అని చెప్పారు.

అక్కినేని అమల మాట్లాడుతూ.. ''టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్ చూస్తుంటే హలో బ్రదర్ సినిమా గుర్తొస్తుంది. చాలా కొత్తగా ఉంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సంక్రాంతి వాతావరణానికి ఈ సినిమా సరిగ్గా సరిపోతుంది. గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుంది'' అని చెప్పారు.

సుమంత్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూస్తుంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్, నాగసుశీల, భాస్కర్ భట్ల, అనంతశ్రీరాం, బాలాజీ, వంశీ పైడిపల్లి, రామజోగయ్యశాస్త్రి, రామ్ లక్ష్మణ్, జెమిని కిరణ్, ఏషియన్ సినిమాస్ సుదీర్, హంసా నందిని, అనసూయ, లావణ్య త్రిపాఠి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement