Advertisement

నాగచైతన్య చిత్రానికి అఖిల్ క్లాప్!

Sun 29th Nov 2015 01:23 PM
nagachaitanya,sruthi hassan,premam remake,akhil clap,anupama parameshwaran  నాగచైతన్య చిత్రానికి అఖిల్ క్లాప్!
నాగచైతన్య చిత్రానికి అఖిల్ క్లాప్!
Advertisement

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ లా కాంబినేషన్ లో 'కార్తికేయ' వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఈరోజు ఉదయం గం:10.30 నిమిషాలకు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోస్ లో వైభవంగా ప్రారంభమైంది.   అక్కినేని నాగచైతన్య, కధానాయికలలో ఒకరైన 'అనుపమ పరమేశ్వరన్' ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అఖిల్ అక్కినేని క్లాప్ నివ్వగా, కెమరా స్విచ్ ఆన్ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేశారు.

ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, జెమిని కిరణ్ , నల్లమలుపు బుజ్జి, దర్శకుడు మారుతి లతో పాటు పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భంగా..

యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. ''అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం లో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది  ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ విశాఖలో  డిసెంబర్ 3న ప్రారంభమవుతుంది. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా  విడుదల చేయనున్నామని తెలిపారు. తెలుగు నేటివిటీ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అని అన్నారు     

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ''అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో  ఆనందంగా ఉంది.  'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పనకు కృషి చేస్తోంది'' అని తెలిపారు దర్శకుడు.

చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement