Advertisement

'భలే మంచి రోజు' ఆడియో విశేషాలు!

Thu 26th Nov 2015 04:19 PM
bhale manchi roju audio launch,mahesh babu,sudheer babu,sreeram adithya  'భలే మంచి రోజు' ఆడియో విశేషాలు!
'భలే మంచి రోజు' ఆడియో విశేషాలు!
Advertisement

సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను రానాకు అందించారు.ఈ సందర్భంగా..

మహేష్ బాబు మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇరవై రోజుల ముందు సినిమా టీజర్ చూసాను. చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే కొత్తగా అనిపించింది. కొత్త కంటెంట్ తో ఉండే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సుధీర్ బాబు ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. డెడికేటెడ్ పెర్సన్. ఈ సినిమా తనకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ''నా తల్లి తండ్రుల సహకారంతో ఈ సినిమా చేసాను. కథను ఇష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. ఈ బ్యానర్ లో అన్ని క్వాలిటీ సినిమాలే వస్తాయి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.  

రానా మాట్లాడుతూ.. ''సుధీర్ కు, దర్శక నిర్మాతలకు నా అభినందనలు. సినిమా రిలీజ్ రోజు 'భలే మంచి రోజు'అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ''సుధీర్ మంచి కాన్సెప్ట్ తీసుకొని కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''సాంగ్స్ అన్ని చాలా బావున్నాయి. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే మంచి చిత్రంగా పేరు తెచ్చుకోవాలి. 'భలే భలే మగాడివోయ్' కంటే సినిమా పెద్ద హిట్ కావాలి. దర్శకనిర్మాతలకు మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు. 

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''ఆగస్ట్ 7 నుండి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ చిత్రంతో ఇంకా పెరుగుతాయి. ఈ చిత్రంతో నిర్మాతలు శ్రీమంతులు కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''సుదీర్ మంచి ఫ్రెండ్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ సినిమా తనకు పెద్ద సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

నందిని మాట్లాడుతూ.. ''టీజర్, సాంగ్స్ చాలా బావున్నాయి. సన్నీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సుధీర్ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఈ సినిమా తనకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వామిక, సుధీర్ బాబు, విజయ్ కుమార్, శశిధర్, వేణు, శ్యాందత్, రామ్ కృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సన్నీ ఎం.ఆర్, ఆర్ట్ డైరెక్టర్: రామ కృష్ణ, డైలాగ్స్: అర్జున్, కార్తిక్, కో డైరెక్టర్: శ్రీరామ్ ఎరగంరెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.టి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement