Advertisement

'సైజ్ జీరో' చూడండి.. కేజీ గోల్డ్ గెలుచుకోండి!

Mon 23rd Nov 2015 05:58 PM
size zero movie gold contest,anushka,prakash kovelamudi,pvp  'సైజ్ జీరో' చూడండి.. కేజీ గోల్డ్ గెలుచుకోండి!
'సైజ్ జీరో' చూడండి.. కేజీ గోల్డ్ గెలుచుకోండి!
Advertisement

అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం 'సైజ్ జీరో'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లో భాగంగా సినిమా చూసిన వారు కేజీ బంగారాన్ని గెలిచే కాంటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ విశేషాల గురించి నిర్మాత పి.వి.పి. మాట్లాడుతూ.. ''సినిమా మేకింగ్ ఎంత ముఖ్యమో.. దాన్ని మార్కెట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం సినిమా లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. రిలీజ్ అయిన మొదటి రోజే పైరసీ జరిగి ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో మా సినిమాను ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశ్యంతో కేజీ బంగారాన్ని గెలుచుకోవచ్చని ఓ కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నాం. ఈ సినిమా థియేటర్ లో టికెట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ తో పాటు ఓ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ పై ఉన్న లెవెన్ డిజిట్ నెంబర్ ను మేము ఇచ్చిన ఫోన్ నంబెర్ కు మెసేజ్ చేయాలి. తద్వారా ఈ కాంటెస్ట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా మా కార్వీ కంపనీ వారు ఒక సిస్టం డెవలప్ చేసారు. దీని ద్వారా ఇరవై మందిని షార్ట్ లిస్టు చేసి వారిలో ఒకరిని విజేతగా ఎంపిక చేసి కేజీ బంగారాన్ని కానుకగా ఇస్తాం. పైరసీను అరికట్టడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ చిత్రానికే కాకుండా మా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఇదే విధంగా విభిన్న కాంటెస్ట్ లను నిర్వహించనున్నాం. ఈ కాంటెస్ట్ లో పి.వి.పి ఉద్యోగులు, కార్వీ సంస్థ ఉద్యోగులు, సైజ్ జీరో చిత్ర బృందాన్ని మినహాయిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 1500 థియేటర్లలో నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నాం '' అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ.. ''ఇదొక కుటుంబ కథా చిత్రం. ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడానికే ఈ గోల్డ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నాం. దీని ద్వారా నిర్మాతతో పాటు ప్రేక్షకులకు కూడా బెనిఫిట్ అవుతుంది'' అని చెప్పారు.

ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ.. ''పైరసీ కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement