Advertisement

రాజు గారి గది మూవీ సక్సెస్ మీట్!

Tue 27th Oct 2015 08:15 AM
raju gari gadi success meet,omkar,ashwin babu,chethan  రాజు గారి గది మూవీ సక్సెస్ మీట్!
రాజు గారి గది మూవీ సక్సెస్ మీట్!
Advertisement

అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రం రాజు గారి గది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో..

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. అవయవదానం మాహాదానం అనే కాన్సెప్ట్ తో హారర్ ఎలిమెంట్స్ తో చిత్రాన్ని తెరకెక్కించాం. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి సందేశాత్మక చిత్రాన్ని తీస్తున్నానని సాయి కొర్రపాటి, అనిల్ సుంకర లు నాకు ఎంతగానో సపోర్ట్ చేసారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఆయనిచ్చిన శాటిలైట్ సపోర్ట్ తోనే సినిమా చేసాను. 50 రోజుల్లో చేయాల్సిన చిత్రాన్ని 42 రోజుల్లోనే పూర్తి చేసాం. అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రెండవ వారానికి థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు.

పూర్ణ మాట్లాడుతూ.. ఇది నా రెండో హారర్ ఫిలిం. అరుందతి సినిమాలో అనుష్క మాదిరిగా నా గెటప్ ఉంటుంది. నాకు ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన ఓంకార్ గారికి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అని చెప్పారు.

అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ తో నాకు మంచి లైఫ్ ఇచ్చారు. టెక్నీషియన్స్ అందరు చాలా కష్టపడి పని చేసారు. ఈ సినిమాను దసరా హిట్ చేసినందుకు అందరికి థాంక్స్.. అని చెప్పారు.

చేతన్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు లభించింది. సినిమాలో ప్రతి ఫ్రేం చాలా జాగ్రత్తగా తీసారు. సాయి కార్తిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అని చెప్పారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ.. చిన్న సినిమాగా మొదలయిన ఈ రాజు గారి గదిని సాయి కొర్రపాటి, అనిల్ సుంకర ల సపోర్ట్ తో పెద్ద సినిమా అయింది. నేను బాగా నమ్మి చేసిన చిత్రమిది. సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ధన్య బాలకృష్ణన్, విధ్యులేక రామన్, జ్ఞానం, నాగరాజ్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటర్: నాగరాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.జ్ఞానం, మ్యూజిక్: సాయి కార్తిక్, ప్రొడ్యూసర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement