Advertisement

కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న కోదండరామ్‌..!

Tue 13th Oct 2015 11:10 AM
kodanda ram,kcr,raithu athmahathalu,tdp,ramana  కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న కోదండరామ్‌..!
కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న కోదండరామ్‌..!
Advertisement

నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను.. ప్రజాక్షేత్రం నుంచి కాదు అంటూ కోదండరాం తన పదవీ విరమణ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌ను భూజాలకెత్తుకున్న ప్రజలకు టీఆర్‌ఎస్‌ ఏడాదిన్నర పాలన ఏమాత్రం రుచించలేదనే చెప్పాలి. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఆలస్యం కావడం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ ఊసే లేకపోవడం, వ్యవసాయం పరిస్థితులు ఏమాత్రం బాగాలేకపోవడం, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఊహలకే పరిమితం కావడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన కేసీఆర్‌ ముందు మిగిలిన ప్రతిపక్షాల నాయకులు ప్రజలకు చిన్నబోయి కనిపిస్తున్నారు. ఇక కేసీఆర్‌కు తగిన స్థాయిలో సమాధానం చెప్పాలంటే.. టీ ఉద్యమంలో ఆయన స్థాయిలో పోరాటం చేసిన నాయకులే కావాలి. ఆ స్థానాన్ని కోదండరామ్‌ భర్తీ చేయగలరని ప్రతిపక్షాల నమ్మకం. ఆ నమ్మకం కార్యరూపం దాల్చే దిశగా కోదండరామ్‌ ప్రభుత్వంపై తన మొదటి అస్త్రాన్ని ప్రయోగించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కోదండరామ్‌ ఇప్పటికే తేల్చేశారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకున్నా.. ప్రజాసమస్యలపై ఆయన ఆధ్వర్యంలో పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందుకే ఆయన పదవీ విరమణ సభకు పార్టీలకతీతంగా టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు హాజరయ్యారు. ప్రజాక్షేత్రంలో కోదండరామ్‌ పోరాటం చేస్తే తాము వెన్నంటే ఉంటామని ఆ పార్టీల నాయకులు పదేపదే ప్రకటిస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడ రమణ కూడా కోదండరామ్‌ను కలిసి ప్రభుత్వం పోరాటానికి సాయపడాల్సిందిగా కోరినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఇక ఇన్నాళ్లపాటు తెలంగాణ ప్రభుత్వంపై తన వ్యతిరేకతను కేవలం ప్రకటనలకే పరిమితం చేసిన కోదండరామ్‌ మొదటిసారి ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. రైతుల ఆత్మహత్యలపై ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్‌ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ప్రభుత్వం చర్యలు రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ పిటీషన్‌తో రైతులకు ఏమేర లబ్ధి చేకూరుతుందో చెప్పలేం కాని.. కేసీఆర్‌కు ఇన్నాళ్ల

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement