Advertisement

ప్లేయర్ కు ప్రముఖుల ప్రసంశలు..!

Tue 13th Oct 2015 02:23 AM
player movie press meet,jagadeesh kumar,parveen raj,suresh  ప్లేయర్ కు ప్రముఖుల ప్రసంశలు..!
ప్లేయర్ కు ప్రముఖుల ప్రసంశలు..!
Advertisement

ఎన్నో యాడ్స్ తో ప్రచార రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డ్రీమ్ మర్చంట్స్ సంస్థ ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించింది. త్రిబుల్ ఎక్స్ కంపెనీ అధినేత మానిక్యవేల్ తన కుమారుడు పర్వీన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్లేయర్ పేరుతో ఓ విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..

కె.విశ్వనాధ్ మాట్లాడుతూ.. పోస్టర్స్ చూస్తుంటే పర్వీన్, హ్యారీ పోటర్ లా కనిపిస్తున్నాడు. చక్కటి కల ఉన్న పోస్టర్స్ డిజైన్ చేసారు. పర్వీన్ తో కలిసి నేనొక యాడ్ చేసాను. ఈ సినిమా బావుంటుందనే నమ్మకం కలుగుతుంది.. అని చెప్పారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ.. బొంబాయి స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా డ్రీమ్ మర్చంట్స్ సంస్థ హైదరాబాద్ లో యాడ్స్ చేస్తున్నారని విన్నాను. వెంటనే అందులో మెంబర్ అయిపోయాను. 400 యాడ్ ఫిల్మ్స్ చేసిన వీరు కనీసం 40 బెస్ట్ ఫిల్మ్స్ చేయాలని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూసిన తరువాత డైరెక్టర్ కంటే కెమెరామెన్ వర్క్ నచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం ఐతే సినిమా రిలీజ్ అయింది. కెమెరా వర్క్ చాలా బావుందని చెప్పాను. కెమెరామెన్ ను పొగుడుతున్నానని నా తమ్ముడు శ్యామ్ కోప్పడ్డాడు. కాని ఈరోజు ఆ కెమెరామెన్ సెంథిల్ కుమార్ బాహుబలి సినిమాకు పని చేసి నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందాడు. అలానే సురేష్ కూడా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమాకు కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది.. అని చెప్పారు.

నిర్మాత జగదీశ్ కుమార్ మాట్లాడుతూ..  డ్రీమ్ మర్చంట్స్ పేరిట 400 కు పైగా యాడ్స్ చేసాం. అరవై నుండి డెబ్బై శాతం టివీలో చూసే యాడ్స్ అన్ని డైరెక్ట్ చేసేది కిషోర్ గారే. త్రిబుల్ ఎక్స్ కంపెనీ అధినేత మానిక్యవేల్ గారి ప్రోద్భలంతో ఎన్నో యాడ్స్ చేసాం. ఆయనకు ఈ సినిమా కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యి వారి కుమారుడ్ని మా చేతిలో పెట్టారు. బ్యాంకాక్, హాంగ్ కాంగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ థ్రిల్లర్ మూవీ ఇది. పర్వీన్ రాజ్ చాలా బాగా నటించాడు. రెండు మూడు టేక్స్ కంటే ఎక్కువ తీసుకునేవాడు కాదు. సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసాడు. కెమెరా వర్క్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. రొటీన్ గా కాకుండా ఓ కొత్త ఆలోచనతో ఈ సినిమా చేసాం.. అని చెప్పారు.

దర్శకుడు జ్ఞానశేఖర్ మాట్లాడుతూ.. సినిమాలో లొకేషన్స్, విజువల్స్ బావున్నాయని అందరూ చెబుతున్నారు. దానికి కారణం మా నిర్మాతలే. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసారు. సురేష్ ఫోటోగ్రఫీ వలన నాకు మేకింగ్ చాలా ఈజీ అయింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. రీరికార్డింగ్ బాగా కుదిరింది. ఇందులో పర్వీన్ రాజ్, జై అనే ఓ జీనియస్ అబ్బాయి పాత్రలో కనిపిస్తాడు.. అని చెప్పారు.

పర్వీన్ రాజ్ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను. ఈ సినిమా కథ విన్నప్పుడు హీరోగా నేను సూట్ అవుతానా అనిపించింది. కాని నా వయసుకు తగ్గ పాత్ర ఇది. అందరం కష్టపడి ఈ సినిమా చేసాం. మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు. 

పర్వీన్ రాజ్, షాహి, నాగినీడు, సీత, చాణక్య సాయి, తిరు, సుదర్శన్, తేజ, రానా, సిరింత్ర, ఈంగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాజేష్ రఘునాథ్, సినిమాటోగ్రఫీ సురేష్, ఎడిటింగ్ సందీప్ రావి, నిర్మాతలు యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి, దర్సకత్వం జ్ఞాన సాగర్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement