Advertisement

రుద్రమదేవిపై దాసరి స్పందన!

Mon 12th Oct 2015 09:36 AM
rudhramadevi,dasari narayanarao,gunasekhar,anushka  రుద్రమదేవిపై దాసరి స్పందన!
రుద్రమదేవిపై దాసరి స్పందన!
Advertisement

అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్ దర్శకనిర్మాతగా రూపొందించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. అక్టోబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ సాధిస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన దర్శకరత్న దాసరినారాయణరావు చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.... 

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. రుద్రమదేవి సినిమా చూశాను. కేవలం కమర్షియల్‌ సినిమాలు మాత్రమే తీస్తున్న ఈ సమయంలో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తీయాలనుకోవడం సాహసమనే చెప్పాలి. అప్పట్లో అల్లూరి సీతారామరాజు, తాండ్రపాపారాయుడు లాంటి చారిత్రాత్మక చిత్రాలొచ్చాయి. 1987 తర్వాత 2015వరకు ఎటువంటి హిస్టారికల్‌ సినిమాలు రాలేదు. దాదాపు 28 ఏళ్ళ తర్వాత వచ్చిన చారిత్రాత్మక చిత్రమే రుద్రమదేవి. ఇటువంటి సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. నేనైతే ఇప్పట్లో ఇలాంటి సినిమా చేసేవాడ్ని కాదు. గుణశేఖర్‌ నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మించడం గొప్ప విషయం. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఒక స్త్రీ ప్రజలను పరిపాలించగలదని తెలియజేసిన చిత్రమిది. రుద్రమదేవి స్ఫూర్తితోనే ఇటలీలో రాణి పాలించింది. గుణశేఖర్‌ డైరెక్ట్‌ చేసే ప్రతి సినిమాలో ఒక స్టయిల్‌ ఉంటుంది. అనుష్కను ఈ సినిమాలో చూసిన తర్వాత సావిత్రి, జయసుధ, జమున లాంటి నటుల సరసన తను చేరగలదనిపించింది . అనుష్క లేకపోతే రుద్రమదేవి సినిమాలేదు. గోనగన్నారెడ్డి పాత్రలో బన్ని అద్భుతంగా నటించాడు. తన ఇంట్రడక్షన్‌ సీన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. బన్ని చాలా గొప్పగా చేశాడు. అలాగే కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌, రానా ఇలా ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలకు కనీసం రెండు వారాల గ్యాప్‌ ఇవ్వాలి. అలా చేస్తే ఈ సినిమా రికార్డులను క్రియేట్‌ చేయగలదు. మరి వారం గ్యాప్‌లోనే పెద్ద సినిమాలు రిలీజ్‌ కావడం ఎందుకో అర్థం కావడం లేదు. ఈ పోటీ ఎంత వరకు సమంజసమో తెలియడం లేదు. సినిమా మంచి కలెక్షన్స్‌ సాధిస్తుంది. తొలిరోజు 9కోట్ల 40లక్షలు, రెండో రోజు 6 కోట్ల 20లక్షలు, మూడో రోజు 6కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఇంత గొప్ప చిత్రాన్ని రూపొందించిన యూనిట్‌ను అభినందిస్తున్నాను.. అని అన్నారు. 

అనుష్క మాట్లాడుతూ.. దాసరి లాంటి గొప్ప దర్శకులు మా చిత్రాన్ని అభినందించినందుకు ఆయనకు ధన్యవాదాలు. రుద్రమదేవి చిత్రాన్ని ఎంకరేజ్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌.. అని అన్నారు. 

గుణశేఖర్‌ మాట్లాడుతూ.. 1987 తర్వాత విడుదలైన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి. దాసరిగారు చేయని సినిమా అంటూ లేదు. అలాంటి గొప్ప దర్శకుడు మా చిత్రాన్ని మెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది.. అని అన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement