Advertisement

త‌మ‌న్‌ రికార్డు స్థాయిలో కొట్టాడు!

Mon 12th Oct 2015 07:02 AM
taman songs,bruce lee hit songs,ram charan,srinu vaitla,music director thaman  త‌మ‌న్‌ రికార్డు స్థాయిలో కొట్టాడు!
త‌మ‌న్‌ రికార్డు స్థాయిలో కొట్టాడు!
Advertisement
టాలీవుడ్‌లో త‌మ‌న్ పేరు మార్మోగిపోతోంది. ఒక‌ప్పుడు  కాపీ ట్యూన్ల సంగీత ద‌ర్శ‌కుడు అనే ముద్ర వేశారు ఆయ‌న‌పై. కానీ బ్రూస్‌లీ పాట‌లు విన్నాక తిట్టినోళ్లే పొగడ‌టం మొద‌లుపెట్టారు. అందులో నిజంగానే అంత మంచి ట్యూన్లు వినిపించాడు తమ‌న్‌. మాస్, క్లాస్ మిక్స‌యిన ఆ పాట‌లు శ్రోత‌ల్ని హాంటింగ్ చేస్తున్నాయి. సాటి సంగీత ద‌ర్శ‌కులు సైతం త‌మ‌న్ సూప‌ర్బ్ అంటున్నారు.
 బ్రూస్‌లీ విష‌యంలో అంతగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన త‌మ‌న్ తాజాగా మ‌రో ఘ‌న‌త సాధించాడు. బ్రూస్‌లీ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని కేవ‌లం 9 రోజుల్లోనే పూర్తి చేశాడ‌ట‌. టాలీవుడ్‌లో అదొక రికార్డు అని చెబుతున్నారు. బ్రూస్‌లీ ప‌నులు మొద‌ట్నుంచీ శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. శ్రీనువైట్ల ముందుగానే డేట్‌ని ప్ర‌క‌టించి సినిమాని షూట్ చేశాడు. అనుకొన్న స‌మ‌యానికే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడాన్ని ఓ ప్రెస్టీజ్ విష‌యంగా భావించిన ఆయ‌న సినిమాని వాయువేగంతో  పూర్తి చేశాడు. షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. మ‌రి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఫాస్ట్‌గా చేయాలి క‌దా! అందుకే త‌మ‌న్ రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మాని కేవ‌లం 9 రోజుల్లోనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడ‌ట‌. ఆయ‌న ఫాస్ట్‌గా ప‌నిచేయ‌డంతోనే సినిమా ఈ రోజు సెన్సార్‌కి వెళ్లిపోయింది. 
త‌మ‌న్ వేగం చూసి శ్రీనువైట్ల చాలా ఆనంద‌ప‌డిపోతున్నారు. త‌మ‌న్ తొమ్మిది రోజుల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేశాడ‌ని విలేక‌ర్ల‌కు గొప్ప‌గా చెబుతున్నాడు. ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గా 60 సినిమాల్ని చేసిన అనుభ‌వం త‌మ‌న్‌కి ఉంది. అంత అనుభవం సంపాదించాక ఇలాంటి అద్భుతాలు ఆవిష్కార‌మ‌వుతాయి. రికార్డుల రికార్డుల మీద కొడుతున్న త‌మ‌న్ అతి త్వ‌ర‌లోనే సెంచ‌రీ పూర్తి చేసేలా క‌నిపిస్తున్నాడు. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement