Advertisement

జగన్మాత ఆడియో విశేషాలు!

Wed 07th Oct 2015 07:35 AM
jaganmatha audio launch,nanduri veeresh,raju,sandeepthi  జగన్మాత ఆడియో విశేషాలు!
జగన్మాత ఆడియో విశేషాలు!
Advertisement

రమ్యకృష్ణ, సందీప్తి, అమిత్, విజయరంగరాజా ప్రాధాన పాత్రల్లో శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ పతాకంపై గజ్జవరపు మహిమా చౌదరి సమర్పిస్తున్న చిత్రం జగన్మాత. నండూరి వీరేష్ దర్శకుడు. ఎన్.ఎస్.రాజు, జె.వెంకటేశ్వరావు నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పుష్పలీల బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను ప్రతాని రామకృష్ణగౌడ్ కు అందించారు. ఈ సందర్భంగా..

రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..  రమ్యకృష్ణ గారు జగన్మాత గా నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. థియేటర్ విషయంలో ఏమైనా సమస్యలు వస్తే ఛాంబర్ తరపున పర్సెంటేజీ విధానాలా ద్వారా థియేటర్లు ఇప్పిస్తాం.. అని చెప్పారు.

పుష్పలీల మాట్లాడుతూ.. సినిమా పేరు చక్కగా ఉంది. పౌరాణిక చిత్రాలు కరువవుతున్న ఈ రోజుల్లో జగన్మాత లాంటి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందించాల్సిన విషయం. నేను రాజకీయనాయకురాలినైనా సినిమాలపై మాత్రం చాలా ఆసక్తి ఉంది. ఆ ఇంట్రెస్ట్ తోనే మై థాట్ క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమా రంగంలో ప్రవేశించనున్నాను. చిత్రబృందం కష్టపడి సినిమా చేసారు. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. సినిమాకు ప్రాంతీయ బేధాలు లేవు. ఎంటర్టైన్మెంట్ అందరికీ ఒక్కటే. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించాలి.. అని చెప్పారు.

సాయి వెంకట్ మాట్లాడుతూ.. జగన్మాత మంచి టైటిల్. ఆ దేవత చరిత్రపై ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరించాలి. గొప్ప సబ్జెక్టు ను చిత్రంగా తెరకెక్కించడం మంచి విషయం. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలను సక్సెస్ చేస్తే ఇండస్ట్రీకి కొత్త నిర్మాతలు  వస్తారు. వారోస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వీరేష్ గారితో నేను బుల్లెట్ బాయ్ అనే సినిమా చేసాను. మంచి కాన్సెప్ట్ తీసుకొని ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ఆయనకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. భీమవరంలో మావూళ్ళమ్మ చాలా ఫేమస్. ఆ అమ్మవారి చరిత్రను కథగా తీసుకొని సినిమా చేస్తున్నారు. ఆవిడ మహిమలను ప్రేక్షకులకు తెలియబరచాలని చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.

సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. నా పాటలు నచ్చి నాకు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

దర్శకుడు నండూరి వీరేష్ మాట్లాడుతూ.. గురు చరణ్ మంచి లిరిక్స్ ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు. 

ఈ చిత్రానికి కెమెరా: హరినాథ రెడ్డి, నాగబాబు, మ్యూజిక్ డైరెక్టర్: రాజ్ కిరణ్, లిరిక్స్: గురు చరణ్, మార్కండేయ, ఎడిటింగ్: శ్రీనుబాబు, స్టిల్స్: మునిచంద్ర, ఆర్ట్: రామకృష్ణ, నిర్మాతలు: ఎన్.ఎస్.రాజు, జె.వెంకటేశ్వరావు, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్టర్: నండూరి వీరేష్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement