Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-జె.డి.చక్రవర్తి

Fri 04th Sep 2015 05:13 AM
dynamite,chakravarthi,vishnu,praneetha,devakatta  సినీజోష్ ఇంటర్వ్యూ-జె.డి.చక్రవర్తి
సినీజోష్ ఇంటర్వ్యూ-జె.డి.చక్రవర్తి
Advertisement

తెలుగులో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన నటుడు జె.డి.చక్రవర్తి ప్రస్తుతం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డైన‌మైట్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జె.డి.చక్రవర్తితో సినీజోష్ ఇంటర్వ్యూ..

మొదట నటించని చెప్పా..

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అరిమనంబి లో నేను నటించాను. మరలా అదే పాత్రలో నన్ను నటించమని అడిగారు. అదే పాత్రలో అవే ఎమోషన్స్ లో నటించడం నాకిష్టం లేక నటించనని చెప్పాను. తరువాత ఓకే చేసాను. డైరెక్టర్ మారాడు. పర్సెప్షన్ మారింది. కంటెంట్ ఒకటే అయినా ప్రెజంటేషన్ ఒకలా ఉండకుండా దేవ్ బాగా చేసాడు. దేవకట్టా అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి. నేను పని చేసిన దర్శకులలో ఓ బెస్ట్ డైరెక్టర్ ఆయన.

పెద్దగా తేడా ఉండదు..

తమిళంలో నేను చేసిన క్యారెక్టర్ కు ఈ సినిమాలో పాత్రకు పెద్దగా తేడా ఉండదు. కొద్దిపాటి తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా బాగా చూపించారు.

ఇంట్రడక్షన్ సీన్ చాలా నచ్చింది..

విష్ణు ఇంట్రడక్షన్ సీన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. కొంతమంది విష్ణును కొట్టడానికి రౌండప్ చేస్తారు. యాక్షన్ ఫిలిం అయినా రొటీన్ గా విష్ణు వారిని కొట్టకుండా వెళ్ళిపోతాడు. ఆ సీన్ నాకు చాలా నచ్చింది.

స్క్రిప్ట్ చెప్పినపుడే చెప్తా..

నాకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడే నాకున్న డౌట్స్ లేదా ఏమైనా యాడ్ చేయాలనిపిస్తే చెప్పేస్తాను. ఒకసారి ఇక సినిమా సెట్స్ పైకి వెళ్ళిన తరువాత నేను ఎలాంటి క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇవ్వను.

అరిమనంబి మంచి ఫిలిం..

అరిమనంబి సినిమాలో హీరోకు, విలన్ కు మధ్య ఎలాంటి పరిచయం ఉండదు. హీరో ఎవరితో పోరాడుతున్నాడో తెలియదు కాని ఎందుకు పోరాడుతున్నాడో తెలుసు. విలన్ పొజిషన్ కూడా అంతే. వారిద్దరికీ ఉన్న టైం పీరియడ్ లో ఎవరు గెలుస్తారో అనే పాయింట్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉంటుంది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిలిం. తమిళంలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగు కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను.

విజయన్ మాస్టర్ అంటే వెనుక ఉండేవాడ్ని..

నా సినిమాలో విజయన్ మాస్టర్ ఉన్నారంటే ఆ సినిమా నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించేవాడ్ని. కాని ఇప్పుడు ఎందుకు చేయలేదా.. అని ఫీల్ అవుతున్నాను. చాలా ప్యాషనేటెడ్ పెర్సన్. విజయన్ మాస్టర్ ఈ సినిమాకు పని చేస్తున్నారని తెలిసినప్పుడే అనుకున్నాను వీరు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తున్నారని. 

అవకాశాలు లేక కాదు..

మలయాళంలో బాస్కర్ ది రాస్కల్ అనే సినిమాలో నటించాను. అది పెద్ద సక్సెస్ అయింది. నాకొక సినిమా పెద్ద హిట్ వచ్చిందని కంగారుపడి వెంట వెంటనే సినిమాలు చేయడం నాకిష్టం ఉండదు. ఛాన్స్ తీసుకోను. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. ఇప్పుడు బాస్కర్ ది రాస్కల్ సినిమా హిందీలో, తమిళంలో చేస్తున్నారు. తెలుగులో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం నేను ఓ సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నాను. ఆ సినిమాకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. అది కాకుండా ఆయన డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నాను. 

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement