Advertisement

‘సినిమా చూపిస్త మావ’ ప్లాటినం డిస్క్ వేడుక!

Sat 29th Aug 2015 03:43 AM
cinema chupistha mava,bekkam venugopal,trinadharao nakkina  ‘సినిమా చూపిస్త మావ’ ప్లాటినం డిస్క్ వేడుక!
‘సినిమా చూపిస్త మావ’ ప్లాటినం డిస్క్ వేడుక!
Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఈ సినిమా ఆగస్ట్‌ 14న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్లాటినమ్‌ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘‘ఆడియో విడుదల అయిన వెంటనే మంచి సక్సెస్‌ సాధించడమే సినిమా సక్సెస్‌కి మొదటి మెట్టు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటినా ఇంకా చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో నడుస్తుంది. మంచి కథ, కథనం ఉన్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా చిత్రమే ఉదాహరణ. సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’’ అన్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూసిన వాళ్ళంతా బావుందని చెబుతున్నారు. రెండు వారావుతున్నప్పటికీ అన్ని థియేటర్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. గతంలో ఎన్నో మంచి మెలోడి సాంగ్స్‌ను అందించిన శేఖర్‌ చంద్ర మంచి మాస్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. పిల్లి కళ్ల పాప సాంగ్‌ ట్యూన్‌నే మొదట కంపోజ్‌ చేశారు. ఆ పాట మాత్రమే కాదు.. ప్రతిసాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆదరించిన వారందరికీ థాంక్స్‌’’ అన్నారు.  

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘బెక్కం వేణుగోపాల్‌కి సినిమా నిర్మాణంపై మంచి అవగాహన ఉంది. మంచి టీమ్‌ కుదిరింది. త్రినాథరావు మంచి కథతో నా దగ్గరకు వస్తే నేను సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తాను. శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ సినిమా సక్సెస్‌ లో కీ రోల్‌ పోషించింది’’ అన్నారు. 

శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు సినిమాల్లో మెలోడీ మ్యూజిక్‌ ఇచ్చాను. 'సినిమా చూపిస్త మావ' లో మాత్రం ట్రెండ్‌ మార్చి మాస్‌ మ్యూజిక్‌ కూడా యాడ్‌ చేసి చేశాను. పాటలు పెద్ద హిట్టయ్యాయి. అలాగే సినిమా అంత కంటే పెద్ద హిట్టయింది’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో మధురశ్రీధర్‌, ప్రసన్నకుమార్‌,  కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement