Advertisement

అక్క‌డ కూడా నాగార్జున పేరే చెప్పింది!

Mon 03rd Aug 2015 03:37 AM
shraya saran,shraya saran about nagarjuna,drishyam hindi movie,  అక్క‌డ కూడా నాగార్జున పేరే చెప్పింది!
అక్క‌డ కూడా నాగార్జున పేరే చెప్పింది!
Advertisement
ఏ గూటికి వెళితే ఆ గూటి ప‌లుకులే ప‌లుకుతుంటారు చాలామంది క‌థానాయిక‌లు. తెలుగులో న‌టిస్తున్న హీరోయిన్ హిందీలో ఆఫ‌ర్ అందుకొని అక్క‌డికి వెళ్లింద‌నుకోండి. అక్క‌డ మీకు ఇష్ట‌మైన క‌థానాయ‌కుడు ఎవ‌రు అని అడిగితే ఏ షారుఖ్‌ఖానో, స‌ల్మాన్‌ఖానో అని చెబుతుంటారు. వాళ్ల దృష్టిలో ప‌డితే మ‌రో అవ‌కాశ‌మైనా వ‌స్తుంద‌నేది ఆ హీరోయిన్ల ఆశ‌. త‌మిళంలోకి వెళితే అక్క‌డి క‌థానాయ‌కుల పేర్లే చెప్పాలి. కానీ శ్రియ మాత్రం హిందీకి వెళ్లినా స‌రే... మ‌న మ‌న్మ‌థుడు నాగార్జున పేరే చెప్పింది. 
"నేను ఎంత మంది క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసినా వాళ్లంద‌రిలో కంటే నాగార్జున‌తో ప‌నిచేయ‌డమే సూప‌ర్బ్‌" అని చెప్పింది. ఆయ‌న‌తో ఉన్న బాండింగ్ ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల హిందీలో అజ‌య్‌దేవ‌గ‌ణ్‌తో క‌లిసి  'దృశ్యం' అనే సినిమా చేసింది శ్రియ‌. తెలుగులో విజ‌య‌వంత‌మైన 'దృశ్యం'కి రీమేక్‌గా ఆ చిత్రం తెర‌కెక్కింది. ఇక్క‌డ మీనా పోషించిన పాత్ర‌ని అక్క‌డ శ్రియ చేసింద‌న్న‌మాట‌. విడుద‌లైన ఆ సినిమాపై శ్రియ  చాలా ఆశ‌లే పెట్టుకొంది. మ‌రికొన్ని హిందీ ఆఫ‌ర్లు తెచ్చిపెట్టే చిత్ర‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది. 
దృశ్యం ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇటీవ‌ల మీడియాతో త‌ర‌చుగా ఇంట‌రాక్ట్ అవుతోంది శ్రియ‌. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రియ నాగార్జున గురించి, ఆయ‌న‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. ''నేన‌ప్ప‌టికి కొత్త‌మ్మాయిని. కానీ నాకు పిలిచి 'సంతోషం'లో న‌టించే అవ‌కాశాన్నిచ్చారు. అది మొద‌లు... వీలైన ప్ర‌తిసారీ నాకు అవ‌కాశమిచ్చి ప్రోత్స‌హించారు. 'మ‌నం'లో న‌టించానంటే కార‌ణం నాగార్జున‌గారే. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య అమ‌ల‌తో కూడా నాకు మంచి స్నేహం ఉంది. ఇద్ద‌రూ కూడా స్వీట్ హార్ట్సే'' అని ఆకాశానికెత్తేసింది. ఇంత‌గా పొగిడాక, అది కూడా నేష‌న‌ల్ మీడియాలో ఇంత పెద్ద‌యెత్తున చెప్పాక నాగార్జున మ‌రో అవ‌కాశం ఇవ్వ‌కుండా ఎలా ఉంటాడూ?!
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement