Advertisement

'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!

Sat 01st Aug 2015 12:09 PM
cinema chupistha mava,raj tarun,rao ramesh,trinadhrao  'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!
'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!
Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'.. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి రావు రమేష్, హీరో రాజ్ తరుణ్ విలేకర్లతో ముచ్చటించారు. 

రావు రమేష్ మాట్లాడుతూ "ఈ సినిమాలో సోమనాథ్ చటర్జీ అనే బెంగాళీకు చెందిన వ్యక్తి పాత్రలో నటించాను. టీమ్ అంతా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. సాయి శ్రీరాం గారి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట అధ్బుతంగా వచ్చింది. రాజ్ తరుణ్ మాస్ ఇమేజ్ క్యారెక్టర్ లో సూపర్బ్ గా నటించాడు. నాన్నగారు, చిరంజీవి గారు మామ అల్లుళ్ళ పాత్రల్లో నటించిన చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. త్రినాధరావు బాగా డైరెక్ట్ చేసాడు. ప్రతి డైలాగ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. దిల్ రాజు గారు సినిమా చూసి బావుందని చెప్పారు. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ "సంవత్సరంన్నర పాటు కష్టపడి చేసిన చిత్రమిది. ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. త్రినాధరావు గారికి అన్ని రకాల చిత్రాలను డైరెక్ట్ చేసే సత్తా ఉంది. మామ క్యారెక్టర్ లో రావు రమేష్ గారు అధ్బుతంగా నటించారు. సినిమాలో పాటలన్నీ కొత్తగా ఉంటాయి. పిల్లికళ్ళ పాప అనే సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ మంచి లవ్ స్టొరీ కు మాస్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఉయ్యాలా జంపాల' చిత్రం తరువాత అవికా గౌర్ నేను కలిసి ఈ చిత్రంలో నటించాం. మా ఇద్దరి మధ్య ఈ సినిమాలో మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమాను చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోస్టర్స్‌ డిజైన్‌: విక్రమ్‌స్వామి, ఛీఫ్‌ ఆసోసియేట్‌ డైరెక్టర్‌: విశ్వనాధ్‌ అరిగెల, స్క్రిప్ట్‌ కోఆర్డినేటర్‌: సాయికృష్ణ, సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-రూపేష్‌ డి.గోహిల్‌-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement