Advertisement

'సాహసం సేయరా డింభకా' సక్సెస్ మీట్!

Thu 30th Jul 2015 08:54 AM
sahasam seyara dimbaka,thirumala shetty kiran,sree  'సాహసం సేయరా డింభకా' సక్సెస్ మీట్!
'సాహసం సేయరా డింభకా' సక్సెస్ మీట్!
Advertisement

శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మించారు. జూలై 24న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ "అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో థియేటర్స్ దొరకకపోవడం వలన అక్కడ ఎక్కువ థియేటర్లలో విడుదల చేయలేకపోయాం. ఈరోజు నుండి థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇది నా మొదటి సినిమా కాబట్టి కొన్ని లిమిటేషన్స్ లో చిత్రాన్ని నిర్మించాను. నా తదుపరి చిత్రం ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ జోనర్ లో నిర్మిస్తున్నాను. దానికి ఎనబై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది" అని చెప్పారు.

తిరుమలశెట్టి కిరణ్ మాట్లాడుతూ "కేవలం మౌత్ టాక్ వలనే ఈరోజు మా చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. షకలక శంకర్ చేసిన క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా అందరం చాలా సంతోషంగా ఉన్నాం" అని చెప్పారు.

హీరో శ్రీ మాట్లాడుతూ "దెయ్యం ప్రేమిస్తే అనే ట్యాగ్ లైన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు నుండి 22 థియేటర్స్ సంఖ్య పెంచుతున్నాం. కొన్ని ఏరియాల నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రొడ్యూసర్ కు ఈ చిత్రంతో మరిన్ని లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ "ఈ సినిమాకు మ్యూజిక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా కలెక్షన్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. చిన్న చిత్రాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement