Advertisement

'ది బెల్స్' మూవీ రిలీజ్ కు సిద్ధం..!

Mon 29th Jun 2015 02:36 AM
the bells movie,july 3rd release,reyan rahul,neha deshpandey  'ది బెల్స్' మూవీ రిలీజ్ కు సిద్ధం..!
'ది బెల్స్' మూవీ రిలీజ్ కు సిద్ధం..!
Advertisement

రాహుల్‌, నేహ దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా జగదాంబ ప్రొడక్షన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది బెల్స్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

నిర్మాత ఎర్రోజు వెంకటాచారి మాట్లాడుతూ "మంచి చిత్రాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యానర్ ను స్థాపించాం. 'ది బెల్స్' మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా. ఒక కమర్షియల్‌ సినిమాకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమా ద్వారా యూత్‌కి ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాం. మ్యూజిక్, ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వారి నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీస్ చూడదగిన చిత్రమిది. జూలై 3న విడుదల కానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఆగస్ట్ రెండవ వారంలో ఈ బ్యానర్ లో ఓ పెద్ద సినిమాను నిర్మించనున్నాం" అని చెప్పారు.

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ మాట్లాడుతూ "సమాజంలో జరిగే అరాచకాలను రూపుమాపడానికి అయిదుగురు స్నేహితులు కలిసి పోరాడే కథే ఈ చిత్రం. సినిమాలో రొమాన్స్, కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చక్కని మెసేజ్‌ కూడా వుంది. ఈ చిత్రంలో విద్యాసాగరరావుగారు ఒక గెస్ట్‌ రోల్‌ చేశారు. అదే విధంగా మధుప్రియ గారు ప్రత్యేక గీతంలో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. కాసర్ల శ్యామ్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. పాటలు కూడా విజువల్‌గా అద్భుతంగా వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా చేయడానికి తన పూర్తి సహకారాన్ని అందించిన వెంకటాచారిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు.

హీరో రేయాన్ రాహుల్ మాట్లాడుతూ "ఇది నా రెండవ సినిమా. మంచి కథ ఉన్న చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక కమర్షియల్ ఎంటర్ టైనింగ్ మూవీ. అయిదుగురు విద్యార్థులు కలిసి ఏం చేసారనేదే ఈ సినిమా కథ. ప్రవీణ్‌ చాలా టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. శేఖర్‌ అందించిన కథను చాలా బాగా హ్యాండిల్‌ చేసి మంచి సినిమా తీశారు. మా నిర్మాత వెంకటాచారిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా తీశారు" అని చెప్పారు.

హీరోయిన్ నేహ దేశ్ పాండే మాట్లాడుతూ "మంచి సందేశాత్మక చిత్రమిది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

రాహుల్‌, నేహ దేశ్‌పాండే, సూర్య, ఎమ్మెస్‌ నారాయణ, సప్తగిరి, శివారెడ్డి, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్‌, సంగీతం: కాసర్లశ్యామ్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్‌, కూనాడి వాసుదేవరెడ్డి, రచన,మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, నిర్మాత: ఎర్రోజు వెంకటాచారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement