Advertisement

'బస్తీ' మూవీ టీజర్ లాంచ్..!

Thu 18th Jun 2015 11:52 AM
basthi movie,vasu manthena,shreyan,pragathi,jayasudha  'బస్తీ' మూవీ టీజర్ లాంచ్..!
'బస్తీ' మూవీ టీజర్ లాంచ్..!
Advertisement

శ్రేయాన్, ప్రగతి జంటగా వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం 'బస్తీ'. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ గురువారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది. సహజనటి జయసుధ టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ "నా కొడుకు శ్రేయాన్ మొదటిసారిగా హీరోగా నటిస్తున్నాడు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉండాలనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే ఇదొక మంచి ప్రేమ కథ. హీరోయిన్ ప్రగతి చక్కగా నటించింది. శ్రేయాన్, ప్రగతి జంట తెరపై అధ్బుతంగా ఉంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకనిర్మాత వాసు మంతెన మాట్లాడుతూ "నాకు మొదటినుండి రకరకాల వ్యాపారాలు చేయడమంటే ఇష్టం. అందులో భాగంగానే ఓ సినిమాను నిర్మించాలనుకున్నాను. కొత్తదనం ఉన్న చిత్రమిది. టెక్నికల్ గా అధ్బుతంగా ఉంటుంది. ఇదొక ఇన్నోసెంట్, రియల్, యంగ్ లవ్ స్టొరీ. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇద్దరు ప్రేమలో పడతారు. అనుకోకుండా హీరోకు ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యను చేదించి తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 36 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసాం. కేవలం 42 గంటల్లోనే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్నాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఐదు పాటలు డిఫరెంట్ జోనర్ లో ఉంటాయి. ఈ నెల జూన్ 21న ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు" అని చెప్పారు.

హీరో శ్రేయాన్ మాట్లాడుతూ "చిన్నప్పటినుండి ఎప్పుడూ యాక్టర్ అవుతాననుకోలేదు. క్రీడారంగంలో రాణించాలనుకున్నాను. నేషనల్ లెవెల్ లో ఓ మెడల్ ను కూడా సొంతం చేసుకున్నాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు లగడపాటి శ్రీదర్ గారు నాకొక స్క్రిప్ట్ వినిపించి నటించమని అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. సడెన్ గా మూడు సంవత్సరాల క్రితం సినిమాలలో నటించాలనే కోరిక కలిగింది. దాంతో బొంబాయి వెళ్లి నటనలో శిక్షణ పొందాను. మా అమ్మకు నేను సినిమాలలోకి రావడం ఇష్టంలేదు. కాని నాకోసం ఒప్పుకున్నారు. లగడపాటి శ్రీదర్ గారు ఫోన్ చేసి నా స్నేహితుడి దగ్గర ఓ స్క్రిప్ట్ ఉంది వింటావా అనడిగారు. వినగానే నాకు నాకు నచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేసారు. ఈ సినిమాలో నా పాత్రకి డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ గుణశేఖర్, హీరోయిన్ ప్రగతి తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి డైలాగ్స్: ప్రభాకర్, మని రాయపు రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, మ్యూజిక్: ప్రవీణ్ ఇమ్మడి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్, ప్రొడ్యూసర్: వజ్మన్ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వాసు మంతెన  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement