Advertisement

'డైనమైట్' ఆడియో లాంచ్..!

Sun 07th Jun 2015 05:46 AM
dainamait audio release,dasari narayana rao,manchu vishnu,mohan babu  'డైనమైట్' ఆడియో లాంచ్..!
'డైనమైట్' ఆడియో లాంచ్..!
Advertisement

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా 'డైన‌మైట్'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సిడిను ఆవిష్కరించి మొదటి సిడిను మోహన్ బాబు భార్య శ్రీమతి నిర్మలకు అందించారు. అచ్చు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లడుతూ "మోహన్ బాబు కుటుంబం అంటే నా కుటుంబమే. మోహన్ బాబు తో నాకు మంచి అనుభందం ఉంది. డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తరువాత మోహన్ బాబే అని పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు సినిమా చేసిన మరో పెదరాయుడు అవుతుంది. మనిషిలో గొప్పతనాన్ని తెలియజేసేది గెలుపోటములు కాదు వ్యక్తిత్వమే అని నమ్మి ముందుకెల్తున్నాడు మంచు విష్ణు. తను నాతో ఎర్రబస్సు సినిమా చేసినపుడు తనేంటో తెలిసింది. నా ఆరోగ్యం కుదుటపడగానే విష్ణు తో మరో సినిమా చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే 35 ఏళ్ళ క్రితం ఒకరితో నేను డైనమైట్ అనే సినిమా చేయాలనుకున్నాను. ఇప్పుడు విష్ణు అదే టైటిల్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. విజయన్ ఫైట్ మాస్టర్ గా  నిర్మితమవుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో ఓ మార్క్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ "కథ బావుంది. సినిమా చాలా బాగా వచ్చింది. దేవకట్టా చేసిన ప్రస్థానం సినిమా చూసాను. మంచి దర్శకుడు. అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా రంగంలో సంపాదించిన కొంత మొత్తాన్ని విద్యాసంస్థలపై వెచ్చించి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. అలానే ఓ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ సినిమా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడు. ప్రతి ఫ్రేములో తన కష్టం కనిపిస్తుంది. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయనున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం" అని చెప్పారు.

విజయన్ మాట్లాడుతూ "విష్ణు మంచి నటుడే కాదు టెక్నీషియన్ కూడా. దేవాకట్ట గారికి ఏం కావాలో తెలుసు. విష్ణు కొత్తగా ప్రేక్షకులకు సినిమా అందించాలని ఈ సినిమా చేసారు" అని చెప్పారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ "సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అధ్బుతంగా ఉంటాయి. విజయన్ మాస్టర్ మంచి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసారు. దేవాకట్ట గారు సినిమాను బాగా డైరెక్ట్ చేసారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డైలాగ్స్: బి.వి.ఎస్.రవి, సంగీతం: అచ్చు, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement