Advertisement

'డాలర్ కి మరోవైపు' మూవీ ఆడియో రిలీజ్..!

Wed 27th May 2015 11:21 PM
  'డాలర్ కి మరోవైపు' మూవీ ఆడియో రిలీజ్..!
'డాలర్ కి మరోవైపు' మూవీ ఆడియో రిలీజ్..!
Advertisement

యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'డాలర్ కి మరోవైపు'. ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ శ్రీక్రితి సమర్పణలో సత్యం నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ బుదవారం ఎఫ్.ఎన్.సి.సి లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నటుడు, మా ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ బిగ్ సిడిను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సౌత్ ఇండియాలో నాకు నచ్చిన నటుడు నాజర్. ఆయన ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు పూసల ఓ మంచి రచయిత. ఆయన నేను కలిసి సినిమాలు చేసాం. పూసల నన్ను బావగారు అని పిలిచేవారు. అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళం. అలాంటిది ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరమైన విషయం. ఏదో సినిమా తీయాలని కాకుండా మంచి విలువలున్న సినిమా తీయాలని ఆయన ఈ సినిమా ప్రారంభించారు. ప్రజల మనస్సులో గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

నాజర్ మాట్లాడుతూ "చాలా రోజుల తరువాత ఇలాంటి ఓ మంచి ఎమోషనల్ సినిమాలో నటించాను. పూసల గారు దర్శకత్వం వహించిన చిత్రంలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది. సత్యం గారు మంచి సందేశాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. పూసల గారి ఆశీస్సులు మాతో ఎప్పటికి ఉంటాయి" అని చెప్పారు.

సంగీత దర్శకుడు కమల్ కుమార్ మాట్లాడుతూ "మ్యూజిక్ డైరెక్టర్ గా ఇది నాకు మొదటి సినిమా. సినిమా చూసాను. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.

నిర్మాత సత్యం మాట్లాడుతూ "ఈ సినిమా షూటింగ్ అందరి సహాయసహకారాలతో చక్కగా జరిగిపోయింది. పెరుగుతున్న సాంకేతికత, నేటితరం వారికి అమెరికా వైపు మోజు పెరగడం, డాలర్లకు భానిసలవ్వడం వంటి కారణాలతో కుటుంబ బాంధవ్యాలు, ఉమ్మడి కుటుంబంలో ప్రేమానురాగాలు కరువవుతున్నాయి. ఇలాంటి సంఘటనలను ఆధారంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాను చూసినవారు కళ్ళు చమర్చకుండా ఉండలేరు. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది" అని అన్నారు. 

డిప్యూటి స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ "పూసల గారు నాకు మంచి ఆత్మీయులు. ఉన్నత విద్యావంతుడు. చిన్నప్పటి నుండి నటనా రంగానికి ఎన్నో సేవలందించారు. అధ్బుతమైన సంభాషణలు రాయగలిగే దిట్ట. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెద్ద చేప చిన్న చేపను మింగేసే పరిస్థితి కనిపిస్తుంది. అలా చేయకుండా సినిమా పెద్దలు ఇలాంటి ఓ సందేశాత్మక చిత్రాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సత్యం గారికి బరోసా కల్పించాలి" అని అన్నారు.

కోడి రామకృష్ణ మాట్లాడుతూ "డాలర్ కి మరోవైపు అనే టైటిల్ పెట్టడానికి చాలా గట్స్ కావాలి. పూసల గారు ఈ టైటిల్ పెట్టారంటే ఆయనలో ఎంత రివల్యూషన్ ఉందో ఆలోచించండి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే సినిమాను విడుదల చేయడమే కష్టంగా ఉంది. ఈ సినిమాకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విడుదల కావాలని కోరుకుంటున్నాను. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన పూసల గారు సినిమాను డైరెక్ట్ చేయడం ఆనందదాయకం. ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "డాలర్ విలువైనది కాబట్టి దాని కోసం అందరు కుటుంబాలను, సొంత ఊళ్ళను, తల్లితండ్రులను వొదిలేసి డాలరే ప్రపంచంగా అనుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. అదే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీయడం అభినందించాల్సిన విషయం.ఈ చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.    

యశ్వంత్ మాట్లాడుతూ "పూసల గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. కుటుంబ విలువల్ని తెలిపే సినిమా ఇది" అని అన్నారు.

మిత్ర మాట్లాడుతూ "కథానాయికగా చక్కని తెచ్చే చిత్రమిది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, ఏడిద శ్రీరాం, జి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement