Advertisement

'చీకటి రాజ్యం' మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!

Sun 24th May 2015 10:00 PM
cheekati rajyam,kamal hasan,trisha,rajesh,prakash raj  'చీకటి రాజ్యం' మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!
'చీకటి రాజ్యం' మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!
Advertisement

లోకనాయకుడు కమల్ హాసన్, త్రిష జంటగా రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా చేస్తున్న చిత్రం 'చీకటి రాజ్యం'. చాలా కాలం తరువాత కమల్ హాసన్ తెలుగులో నేరుగా చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో ఆదివారం(మే 24)నాడు రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా..

కమల్ హాసన్ మాట్లాడుతూ "ఉత్తమ విలన్ సినిమా రిలీజ్ టైంలో తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం ఎప్పుడు చేస్తారని చాలా మంది అడిగారు. త్వరలోనే చేస్తానని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఈరోజు నా మాట నిలబెట్టుకున్నాను. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో చేస్తున్నాం. మరలా మరలా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలనుంది. రాజేష్ నాతో ఏడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పటికి ఆయనతో సినిమా తీయడం కుదిరింది. నా గురువు బాలచందర్ గారితో 36 సినిమాలు చేసాను. 37వ సినిమా ఉత్తమ విలన్ చేసిన తరువాత ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు కొన్ని నాలో కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్ని బాలచందర్ గారి నుంచి వచ్చినవే. ప్రస్తుతం రాజేష్ కు నేనొక బాలచందర్ లాంటి వాడిని. ఈ సినిమాకి సాను ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఆయన ఎంత బాగా తీస్తారో విశ్వరూపం సినిమా చూస్తే తెలుస్తుంది. రచయిత అబ్బూరి రవి మనం కలిసి సినిమా చేద్దాం సర్ అని అడిగారు. తొందరలోనే చేస్తున్నాం అనగానే ఆయన కూడా నమ్మలేకపోయారు. ఆయనకు చెప్పిన కొంత వ్యవదిలోనే ఫోన్ చేసి నా సినిమాకు మాటలు రాయాలి అనగానే ఒప్పుకొన్నారు. సినిమా అనేది ఓ డ్రమాటిక్ కళ. అది ఎవరి వలన హిట్ అవుతుందో ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. ఒకసారి కెమెరామెన్ సినిమా కావచ్చు. మరొకసారి డైరెక్టర్ సినిమా కావచ్చు. నాకు షోలే సినిమా చూస్తే అది గబ్బర్ సింగ్ సినిమా అనిపిస్తుంది. ఆయన పాత్రే బాగా గుర్తుండిపోయింది. 'చీకటి రాజ్యం' ఓ భిన్నమైన సినిమా. ప్రేక్షకులు సినిమా చూసిన రెండు గంటలలో  సమయం ఎలా అయిందో తెలియకుండా బయటకి వస్తారు" అని చెప్పారు.

దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ "ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం ఓ వరంలా భావిస్తున్నాను. ఈ వరాన్ని కాపాడుకొని అందరికీ నచ్చే విధంగా సినిమా తీయడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు.

త్రిష మాట్లాడుతూ "కమల్ గారితో వర్క్ చేయడం అందికీ ఓ కళ లాంటిది. నాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మునుపెన్నుడూ చేయని పాత్రలో నటించాను" అని చెప్పారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ "కమల్ హాసన్ గారి దృష్టి నాపై పడడం నాకు ఆయన ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కమల్ గారు తెలుగులో నేరుగా సినిమా తీయడం ఆనందకరమైన విషయం. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ "కమల్ ఓ మాహానది. నాకు ఫోన్ చేసి తెలుగులో సినిమా చేస్తే బావుంటుంది కదా అనగానే తెలుగు ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే అని చెప్పాను. ఆయన ఈరోజు తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేయడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు కిషోర్, సినిమాటోగ్రాఫర్ సాను పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: జిబ్రాన్, ఎడిటర్: విజయ్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ నవాస్.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement