Advertisement

ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు చనిపోయారు..!

Sat 23rd May 2015 11:35 AM
dongata success meet,mohan babu,lakshmi prasanna,vamsi krishna  ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు చనిపోయారు..!
ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు చనిపోయారు..!
Advertisement

మంచు లక్ష్మీ, అడవి శేష్‌ ప్రధాన పాత్రల్లో విద్య నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎన్‌.వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగాట’. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ "నా చిన్న కుమారుడు మనోజ్ పెళ్ళితో తండ్రిగా నా భాధ్యతలు నెరవేరాయి. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ నా అభినందనలు. సినిమా అనేది చాలా కష్టమైనది. చిత్ర పరిశ్రమలో సక్సెస్ సినిమాలు తీసినవారు ఫెయిల్యూర్ సినిమాలు తీసారు. ఫెయిల్ అయిన వారు సక్సెస్ కూడా అయ్యారు. అసలు లక్ష్మి ప్రసన్న సినిమాలలోకి రావడం నాకిష్టం లేదు. కాని విష్ణు ప్రోత్సాహంతో టి.వి షో లు చేసి సినిమాల్లోకి వచ్చింది. నిర్మాతగా కూడా మారింది. డైలాగ్స్ అధ్బుతంగా చెప్తుంది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడింది. వంశి సినిమాను చక్కగా చిత్రీకరించాడు. వరికుప్పల యాదగిరి మంచి సాహిత్యాన్ని అందించాడు. ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు చనిపోయారు. మంచి దర్శకులు కూడా కొందరే ఉన్నారు. ఇప్పుడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారు ఫైనాన్షియర్స్ దగ్గర డబ్బు తీసుకొని వారిని మోసం చేస్తున్నారు. అలాంటి వారు పెద్ద నిర్మాతలు కారు దొంగలు. మోసం చేసి సినిమాలు చేయకూడదు. చిన్న నిర్మాతలు బ్రతికున్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. చిన్న నిర్మాతలకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బా సొమ్ము కాదు. అందరు కలిసుంటేనే చక్కగా ఉండగలం. గుట్టు, గోప్యంగా ఉండి అందరికీ వీలైనంత సహాయం చేసి కలసికట్టుగా ఉండాలి" అని చెప్పారు.

లక్ష్మి మంచు మాట్లాడుతూ "నేను కామెడీ జోనర్ లో తీసిన మొదటి సినిమా ఇది. సినిమా కోసం అందరు చాలా కష్టపడి పని చేసారు. వంశి దర్శకునిగానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా నాకు చాలా సపోర్ట్ చేసాడు. ఈ సినిమా నాకు హోప్ ను, స్త్రెంగ్థ్ ను ఇచ్చింది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు.

వంశి మాట్లాడుతూ "సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేసినా అది ప్రేక్షకులకు రీచ్ అయితే సక్సెస్ అవుతుంది. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

అడవిశేష్ మాట్లాడుతూ "ఈ సినిమా సక్సెస్ లో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశి మంచి స్టైలిష్ డైరెక్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి, లక్ష్మి గారికి నా థాంక్స్" అని చెప్పారు.

వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ "సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా లక్ష్మి గారికే చెందుతుంది. ఇంత మంచి సినిమాలో నాకు చాన్స్ ఇవ్వడం, నా పాట తో లక్ష్మి గారు సింగర్ గా పరిచయమవ్వడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ "ఈ సినిమాలో రెండు పాటలు రాసాను. సాంగ్స్ విజువల్ గా కూడా బాగున్నాయి. వంశికు ఎలాంటి మ్యూజిక్ కావాలో బాగా తెలుసు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో గిరిబాబు, పృద్విరాజ్, మధునందన్, ప్రభాకర్, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement