Advertisement

'లయన్' సినిమా సక్సెస్ మీట్..!

Fri 22nd May 2015 02:53 AM
lion movie success meet,balakrishna,rudhrapati ramanarao,sathyadeva  'లయన్' సినిమా సక్సెస్ మీట్..!
'లయన్' సినిమా సక్సెస్ మీట్..!
Advertisement

'లెజెండ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించిన సినిమా 'లయన్'. మే 14న విడుదలయిన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకొని సక్సెస్ ఫుల్ గా అని థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు రామాంజనేయులు మాట్లాడుతూ "సినిమా బావుందని అభిమానులంతా ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

దర్శకుడు సత్యదేవ మాట్లాడుతూ "సినిమా విడుదలయ్యి వారం రోజులయ్యింది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారనడానికి ఉదాహరణే 'లయన్' సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణ గారు అధ్బుతంగా నటించారు. ముఖ్యంగా గాడ్ సే అనే పాత్ర కోసం ఆయన చాలా కేర్ తీసుకున్నారు. ఆయన శరీర బరువును కూడా తగ్గించుకున్నారు. ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని చేసే అవకాశం బాలకృష్ణ గారు నా మీద నమ్మకంతో ఇచ్చారు. టెక్నికల్ యాస్పెక్ట్స్ ఉన్న సినిమా ఇది. సి.జి. వర్క్ డిలే అవ్వకుండా సమయానికి అందించారు. ఆడియో కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరు చాలా సంతోషంగా ఉన్నారు" అని చెప్పారు.

నిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ "లెజెండ్ సినిమా హిట్ తరువాత బాలకృష్ణ గారు నాకిచ్చిన అవకాశం ఇది. సినిమా విడుదలయిన తరువాత ఆయన ఇంటికి పిలిచి సినిమా చాలా లావిష్ గా చేసావని చెప్పారు. బడ్జెట్ లో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా తీసిన చిత్రమిది. కొత్త నిర్మాత, డైరెక్టర్ అని ప్రోత్సహించకుండా సినిమా రిలీజ్ కు ముందు కొందరు నెగెటివ్ గా మాట్లాడారు. కాని మూవీ రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని వారందరికీ సమాధానం ఇచ్చింది. సినిమాను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు.

హీరో బాలకృష్ణ మాట్లాడుతూ "సింహా, లెజెండ్ సినిమాల హిట్స్ తరువాత మేము తలపెట్టిన యజ్ఞం 'లయన్'. ఈ సినిమా స్టొరీ సత్యదేవా నాకు ఆరు సంవత్సరాల క్రితమే చెప్పారు. అప్పటినుంచి చేయాలనుకున్నాం. రుద్రపాటి రమణారావు నా అభిమానిగా నాతో సినిమా చేయాలని ముందుకొచ్చారు. ఆయనకి ఈ కథ చెప్పగానే చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తప్పకుండా ఈ సినిమా నా అభిమానులందరికీ నచ్చుతుందని చేసాం. ఈ మూవీలో నన్ను మూడు డిఫరెంట్ షేడ్స్ లో చూపించారు. త్రిష, రాధిక ఆప్టే సినిమాలో అధ్బుతంగా నటించారు. టెక్నికల్ పిక్చర్ ఇది. మణిశర్మ గారి సంగీతం అధ్బుతంగా కుదిరింది" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అలీ, వివేక్, ప్రసన్న కుమార్, చిత్ర లేఖ, కాశి విశ్వనాథ్, కోటేశ్వరావు, ఫణి, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement