Advertisement

తెలుగు రాష్ట్రాలలో ‘లయన్‌’ హవా ఇలా వుంది.!

Sat 16th May 2015 07:56 AM
telugu movie lion,lion first day collections,lion review,hero balakrishna,trisha  తెలుగు రాష్ట్రాలలో ‘లయన్‌’ హవా ఇలా వుంది.!
తెలుగు రాష్ట్రాలలో ‘లయన్‌’ హవా ఇలా వుంది.!
Advertisement

నందమూరి బాలకృష్ణ, సత్యదేవ కాంబినేషన్‌లో రుద్రపాటి రమణారావు నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లయన్‌’కి వరల్డ్‌వైడ్‌గా డివైడ్‌ టాక్‌ వున్నప్పటికీ ఓపెనింగ్స్‌ మాత్రం భారీగానే వచ్చినట్టు కలెక్షన్స్‌ చూస్తే అర్థమవుతుంది. మొదటి రోజు కలెక్షన్స్‌ కొన్ని చోట్ల ‘లెజెండ్‌’ని క్రాస్‌ చేస్తే, కొన్ని ఏరియాల్లో శ్రీరామరాజ్యం ఫుల్‌ రన్‌ని కూడా ఒకేరోజులో క్రాస్‌ చేయడం విశేషం. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘లయన్‌’ సాధించిన కలెక్షన్స్‌ని పరిశీలిద్దాం.

నైజాంలో 1 కోటి 47 లక్షల 61 వేలు, సీడెడ్‌లో 1 కోటి 20 లక్షలు, వైజాగ్‌లో 49 లక్షల 12 వేలు, ఈస్ట్‌లో 43 లక్షలు, వెస్ట్‌లో 45 లక్షలు, కృష్ణాలో 44 లక్షల 75 వేలు, గుంటూరులో 70 లక్షలు, నెల్లూరులో 33 లక్షల 19 వేల రూపాయల షేర్స్‌ కలెక్ట్‌ చేసింది ‘లయన్‌’. టోటల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మొదటి రోజు 5 కోట్ల 52 లక్షల 69 వేల రూపాయల షేర్‌ సాధించింది. అమెరికాలో 80 సెంటర్స్‌లో ‘లయన్‌’ ప్రీమియర్‌ షోలు ప్రదర్శించగా అక్కడ కూడా మొదటి రోజు మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. 

కలెక్షన్ల వివరాలు అలా వుంటే ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 5 కోట్ల 50 లక్షలు లభించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. సింహా, లెజెండ్‌ చిత్రాల వల్ల ‘లయన్‌’ చిత్రానికి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ కలెక్షన్స్‌ ఎంతవరకు నిలబడతాయనే విషయంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్‌ అద్భుతంగా వున్నప్పటికీ, మరికొన్ని ఏరియాల్లో అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా బాలకృష్ణ అభిమానులు, నిర్మాత రుద్రపాటి రమణారావు సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారట. ఫస్ట్‌ డే రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధించినందుకు వారు ఎంతో హ్యాపీగా వున్నారు. కలెక్షన్స్‌ ఇంకా పెరిగి సినిమా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని రుద్రపాటి చెప్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement