Advertisement

'దాన వీర శూర కర్ణ' ఆడియో విడుదల..!

Thu 07th May 2015 05:54 AM
dana veera soora karna movie,kalyan ram,junior ntr,master ntr  'దాన వీర శూర కర్ణ' ఆడియో విడుదల..!
'దాన వీర శూర కర్ణ' ఆడియో విడుదల..!
Advertisement

నందమూరి నాలుగో తరం నటవారసులు 'మాస్టర్' ఎన్టీఆర్, సౌమిత్రులను వెండి తెరకు పరిచయం చేస్తూ శ్రీ సాయి జగపతి పిక్చర్స్ మరియు సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా బాల నటీనటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'దాన వీర శూర కర్ణ'. జె.వి.ఆర్. దర్శకుడు. సి.హెచ్.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన హీరో కళ్యాన్ రామ్ బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సీడీని జూనియర్ ఎన్టీఆర్ కు అందించారు. కౌసల్య సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా కళ్యాన్ రామ్ మాట్లాడుతూ "నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగాం. మమ్మల్ని ప్రోత్సహించిన నిర్మాతలకు, అభిమానిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. 'దానవీర శూర కర్ణ' సినిమా ద్వారా ఇప్పుడు మా అబ్బాయిలు పరిచయమవుతున్నారు. మమ్మల్ని ఆదరించినట్లుగానే వారిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంత గొప్ప సినిమాను నిర్మించడానికి దైర్యం చేసిన చిత్రబృందానికి నా అభినందనలు" అని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఈరోజు ఎంతో గర్వంగా ఉంది. మా తాతగారి తరువాత వచ్చిన మా కుటుంబ సభ్యులంతా బాల నటులుగా వెండితెరకు పరిచయమయ్యాం. మా వంశం నుండి వస్తున్న నాలుగో తరం వారు కూడా బాల నటులుగా పరిచయం కానుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని అందించిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. పిల్లలతో చిత్రాన్ని తెరకెక్కించడం చాలా కష్టం. వారి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది" అని తెలిపారు.

మాస్టర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "అందరికి నా ధన్యవాదాలు. సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

సి.హెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇలాంటి సినిమాను బాల నటీనటులతో చేయడం సాహస కార్యం. ఈ చిత్రంలో నటించిన బాలలలో కొంత మందికి మంచి భవిష్యతు ఉంటుంది. ఎమ్మెస్ రెడ్డి గారు తీసిన బాల రామాయణాన్ని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా తీసాం. నందమూరి నతవారసులు మా చిత్రంతో పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది. కౌసల్య, వందేమాతరం మంచి మ్యూజిక్ అందించారు. నాకు ఎంతగానో సహకరించిన టెక్నీషియన్స్ అందరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

జె.బాలరాజు మాట్లాడుతూ ''ఒకప్పటి దాన వీర శూర కర్ణ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. కేవలం 1116 రెమ్యునరేషన్ గా తీసుకొని నందమూరి వారసులు మా చిత్రంలో నటించారు. వారు అంగీకరిస్తే 'మాయాబజార్' చిత్రం చేయాలనుంది" అని తెలిపారు.

కౌసల్య మాట్లాడుతూ "ఇలాంటి ఓ మహత్తర కార్యమైన సినిమాను పిల్లలతో తీయడం దానికి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది. ఈ అవకాసం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు.

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "ఇదొక గొప్ప సబ్జెక్ట్. దీనిని తెరకెక్కించడానికి ఎంతో అవగాహన కావాలి. జె.వి.ఆర్ చిత్రీకరిస్తున్నాడని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఇలాంటి సినిమాను బాల నటీనటులతో చేయడం సాహస కార్యం. ఈ చిత్రంతో నందమూరి వారి నాలుగో తరం నటవారసులను పరిచయం చేయడం ఆనందకరమైన విషయం" అని అన్నారు.

సి.కళ్యాన్ మాట్లాడుతూ "రఘుపతి వెంకటేశ్వరావు గారు దర్శకత్వం వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. కృషి, పట్టుదల ఉన్న మనిషి. ఈ చిత్రంతో ఇంకా ఎన్నో పౌరాణిక చిత్రాలను ఆయన నిర్మించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ వింటూ పెరిగాం. అలాంటిది ఆయన సినిమాకి రచయితగా పని చేసినందుకు చాలా గర్వంగా ఉండేది. వారి కుటుంబానికి చెందిన మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్ర  పౌరాణిక చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. మాస్టర్ ఎన్టీఆర్ ను చూస్తుంటే హరికృష్ణ గారు గుర్తొస్తున్నారు" అని చెప్పారు.

కొడాలి వెంకటేశ్వరావు మాట్లాడుతూ "ఈ చిత్రం పాటలు, ట్రైలర్ చూస్తుంటే ఎమ్మెస్ రద్దీ గారి రామాయణం గుర్తొస్తుంది. ఆనాడు రామాయణం ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్స్ కు మంచి లాబాలు రావాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

సి.రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ "పురాణాలను, సంప్రదాయాలను మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఓ పౌరాణిక చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడం సంతోషంగా ఉంది. సినిమా మంచి సక్సెస్ ను సాధించి అందరికి మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు.

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ "నా సినిమాతో సింగర్ గా పరిచయమయిన కౌసల్య ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవ్వడం సంతోషంగా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి" అని అన్నారు.

కాజా సూర్యనారాయణ నిర్మాణ నిర్వహకుడిగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రంలో  జయంత్‌ సాయి, యశ్వంత్‌, దిలీప్‌తేజ, శ్యామ్‌గోపాల్‌, కారుణ్య, భార్గవి, యామిని, సాహిత్య, విజ్జు, అభిరామ్‌, చందన్‌, గణేష్‌, దినేష్‌, లోహిత తదితర బాలురు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: కౌసల్య, కళ: ఎస్.ఆర్.కె.శర్మ, ఎడిటర్: నందమూరి హరి, పోరాటాలు: డ్రాగన్ ప్రకాష్, మేకప్: సి.మాధవరావు, పాటలు: 'గంగోత్రి' విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, నృత్యాలు: ప్రమీల, రమణ. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement