Advertisement

మే 1న ‘పండగ చేస్కో’ ఆడియో

Tue 28th Apr 2015 03:07 AM
hero ram,telugu movie pandaga chesko,ss thaman,pandaga chesko audio on 1st may,rakul preeth singh  మే 1న ‘పండగ చేస్కో’ ఆడియో
మే 1న ‘పండగ చేస్కో’ ఆడియో
Advertisement

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘సింహా’ నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పండగ చేస్కో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియో మే 1న గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు పరుచూరి ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మా చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియోను మే 1న హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. ఈ చిత్రానికి థమన్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. శ్రీమణి, భాస్కరభట్ల చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. ఈ చిత్రంలో రామ్‌ క్యారెక్టర్‌ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. సేమ్‌ టైమ్‌ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచనా సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: సమీర్‌రెడ్డి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,  ఫైట్స్‌: రామ్‌`లక్ష్మణ్‌,  సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డాన్స్‌: రాజు సుందరం, కాస్ట్యూమ్స్‌: రమేష్‌, మేకప్‌: టి.నాగు, చీఫ్‌ కోడైరెక్టర్‌: బి.సత్యం, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: యోగానంద్‌, సమర్పణ: పరుచూరి ప్రసాద్‌, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement