Advertisement

‘ఆంధ్రాపోరి’ మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌

Fri 24th Apr 2015 06:56 AM
telugu movie andhra pori,akash puri,ulka gupta,ramesh prasad,raj madiraju,k.raghavendra rao  ‘ఆంధ్రాపోరి’ మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌
‘ఆంధ్రాపోరి’ మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌
Advertisement

ఆకాష్‌ పూరి, ఉల్క గుప్తా జంటగా ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజ్‌ మాదిరాజు దర్శకత్వంలో ఎ.రమేష్‌ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆంధ్రాపోరి’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ.రమేష్‌ప్రసాద్‌, దర్శకుడు రాజ్‌ మాదిరాజు, హీరో ఆకాష్‌ పూరి, హీరోయిన్‌ ఉల్క గుప్తా, సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ వనమాలి పాల్గొన్నారు. ఇదే వేదికపై ఆంధ్రాపోరి డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ని కూడా కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

కె.రాఘవేంద్రరావు: ఎవరినైనా ఎవరి దగ్గర పనిచేస్తున్నావు అని అడిగితే అది ఆ వ్యక్తి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అదే ఎక్కడ పనిచేస్తున్నావని అడిగితే అది ఆ సంస్థ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆ వ్యక్తే సంస్థగా మారి 30 సినిమాలు నిర్మించే స్థాయి రీచ్‌ అయ్యాడంటే అంతకుమించిన గొప్పతనం మరొకటి వుండదు. ఈ సినిమాకి పనిచేయడం ఈ ఆర్టిస్టుల, టెక్నీషియన్ల అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు టాప్‌ హీరోలుగా వున్నవాళ్ళంతా ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చినవారే. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా చిన్న పూరికి, ఆంధ్రాపోరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎ.రమేష్‌ప్రసాద్‌: రాఘవేంద్రరావు, నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మా ఇద్దరి తల్లిదండ్రులకు, మా ఫ్యామిలీకి ఎంతో ఎటాచ్‌మెంట్‌ వుంది. రాఘవేంద్రరావు ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత మంచి పేరు తెచ్చుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మా నాన్నగారు, ఆయన నాన్నగారు ఎంతో కష్టపడి మంచి మెరిట్‌తో పైకి వచ్చారు. మా కుటుంబం అంతా ఎప్పటి నుంచో సినిమాకే సేవ చేస్తున్నాం. ఆ తృప్తి నాకు వుంది. అయితే ఈమధ్యకాలంలో నిర్మాతగా నాకు అంత సంతృప్తికరంగా లేదు. ఆమధ్య మేం చేసిన సినిమా అంతగా ఆడలేదు. రాజ్‌లో మంచి టాలెంట్‌ వుంది. అందుకే మళ్ళీ ఆయనతోనే సినిమా చేశాం. మరాఠిలో సూపర్‌హిట్‌ అయిన ‘టైమ్‌పాస్‌’ అనే చిత్రం ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది. 

రాజ్‌ మాదిరాజు: రాఘవేంద్రరావుగారితో చాలాకాలం ట్రావెల్‌ చేశాను. ఆయన వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా చిన్న విషయాలు కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఈ బేనర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. ఇది మంచి కమర్షియల్‌ మూవీ అవుతుందని నా నమ్మకం. ఆంధ్రాపోరి అని టైటిల్‌ పెట్టారు, మీకు తెలుగమ్మాయి దొరకలేదా అనే డౌట్‌ వస్తుంది. కానీ, ఈ అమ్మాయి మంచి తెలుగు మాట్లాడుతుంది. డబ్బింగ్‌ కూడా ఆమెతోనే చెప్పిద్దాం అనుకున్నాం. అయితే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్‌ ఆమె మాటల్లో కనిపించడం వల్ల వేరేవారితో డబ్బింగ్‌ చెప్పించాం. ఈరోజు రిలీజ్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌కి మంచి అప్లాజ్‌ వస్తుంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌ షెహనాయ్‌ వాయిద్యం వాడడం జరిగింది. ఈమధ్యకాలంలో ఈ వాయిద్యం తక్కువగా వినిపిస్తోంది. ఈ పోస్టర్‌కి అది వాడడం వల్ల కొత్త అందం వచ్చింది. ఇది ఫస్ట్‌ స్టెప్‌. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. 

ఆకాష్‌పూరి, ఉల్క గుప్తా, అరవింద్‌ కృష్ణ, ఈశ్వరిరావు, పూర్ణిమ, ఉత్తేజ్‌, డా॥ శ్రీకాంత్‌, అభినయ, శ్రీముఖి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి, సంగీతం: డా॥ జోశ్యభట్ల, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డాన్స్‌: చంద్రకిరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మహేష్‌ చదలవాడ, కోడైరెక్టర్‌: రమేష్‌ నారాయణ్‌, నిర్మాత: ఎ.రమేష్‌ప్రసాద్‌, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement